FIFA World Cup 2026: అర్జెంటీనా ఖేల్ ఖతం.. 16 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ కొట్టిన స్పెయిన్

Published : Jul 20, 2026, 07:03 AM IST

Spain Wins FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాను 1-0తో ఓడించి స్పెయిన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ కొట్టిన గోల్‌తో లియోనెల్ మెస్సీ టైటిల్ డిఫెన్స్ కల చెదిరిపోయింది.

PREV
15
ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేత స్పెయిన్.. మెస్సీ కలల సామ్రాజ్యాన్ని ముంచేసిన ఫెరాన్ టోరెస్ క్లాసిక్ గోల్

ఫుట్‌బాల్ ప్రపంచానికి కొత్త ఛాంపియన్ దొరికాడు. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ ఆరంభం నుండి స్పెయిన్ టీమ్ ఫుల్ డామినేషన్ చూపించింది. అర్జెంటీనాను కేవలం డిఫెన్స్‌కే పరిమితం చేసింది.

అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ గోడలా అడ్డుపడటంతో నిర్ణీత 90 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కానీ ఎక్స్‌ట్రా టైమ్ సెకండ్ హాఫ్‌లో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టోరెస్ మ్యాజిక్ చేశాడు. మ్యాచ్ 106వ నిమిషంలో టోరెస్ నెట్ పైభాగానికి కొట్టిన బుల్లెట్ లాంటి షాట్ గోల్‌గా మారింది. ఈ ఒక్క గోల్ మ్యాచ్ విన్నింగ్ గోల్‌గా నిలిచి స్పెయిన్‌ను ఛాంపియన్‌ను చేసింది.

25
మెస్సీ కల ముక్కలు.. అర్జెంటీనాకు రెడ్ కార్డ్ షాక్

ఈ ఓటమితో అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ కెరీర్‌లో మరో వరల్డ్ కప్ అందుకోవాలనే కల పూర్తిగా చెదిరిపోయింది. 39 ఏళ్ల మెస్సీని కట్టడి చేయడానికి స్పెయిన్ వేసిన పక్కా ప్లాన్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ పూర్తిగా చిక్కుకుపోయాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీకి గోల్ చేసే ఒక్క అవకాశం కూడా అర్జెంటీనా ఆటగాళ్లు సృష్టించలేకపోయారు.

దీనికి తోడు 90 నిమిషాల తర్వాత యాడ్ చేసిన ఇంజరీ టైమ్‌లో అర్జెంటీనా స్టార్ ఎంజో ఫెర్నాండెజ్ వరుసగా రెండు ఎల్లో కార్డ్‌లు చూసి రెడ్ కార్డ్‌తో గ్రౌండ్ వీడాడు. దీంతో ఎక్స్‌ట్రా టైమ్‌లో అర్జెంటీనా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని వాడుకున్న స్పెయిన్ మ్యాచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది.

35
స్పెయిన్ అన్‌బీటెన్ రన్.. హిస్టారికల్ విక్టరీ

కోచ్ లుయిస్ డి లా ఫ్యూయెంటె పర్యవేక్షణలో స్పెయిన్ టీమ్ వరుసగా 37 మ్యాచ్‌ల అన్‌బీటెన్ రికార్డ్‌తో ఫైనల్ బరిలోకి దిగింది. ఈ టోర్నమెంట్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క గోల్ సమర్పించుకుని స్పెయిన్ తన డిఫెన్స్ పవర్ ఏంటో చూపించింది. గ్రూప్ స్టేజ్‌లో కేప్ వెర్డేతో డ్రా చేసుకున్న స్పెయిన్, ఆ తర్వాత సౌదీ అరేబియా (4-0), ఉరుగ్వే (1-0)లపై గెలిచి గ్రూప్ హెచ్ టాపర్‌గా నిలిచింది. నౌకౌట్ దశలో ఆస్ట్రియాను 3-0తో, పోర్చుగల్‌ను 1-0తో, క్వార్టర్స్‌లో బెల్జియంను 2-1తో, సెమీస్‌లో ఫ్రాన్స్‌ను 2-0తో ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చింది.

ఫైనల్‌లో కూడా అర్జెంటీనా కేవలం ఒకే ఒక్క షాట్ టార్గెట్‌పైకి కొట్టేలా నియంత్రించి, స్పెయిన్ ఏకంగా 12 షాట్లు కొట్టి మ్యాచ్‌ను శాసించింది. 2010లో తొలిసారి కప్ కొట్టిన స్పెయిన్, మళ్లీ 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రెండో స్టార్‌ను తన జెర్సీపై చేర్చుకుంది.

45
19 ఏళ్ల యమాల్ రికార్డ్.. టోరెస్ రేర్ ఫీట్

స్పెయిన్ 2010లో మొదటిసారి వరల్డ్ కప్ గెలిచినప్పుడు బార్సిలోనా వండర్ కిడ్, 19 ఏళ్ల లామిన్ యమాల్ వయసు కేవలం మూడేళ్లు. ఇప్పుడు అదే యమాల్ తన ఫస్ట్ వరల్డ్ కప్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. ఇప్పటికే యూరో 2024 గెలిచిన స్పెయిన్, ఇప్పుడు వరల్డ్ కప్ కూడా కొట్టి 2008-2012 నాటి గోల్డెన్ ఎరాను గుర్తు చేస్తోంది.

ఇక మ్యాచ్ విన్నర్ ఫెరాన్ టోరెస్ ఫుట్‌బాల్ హిస్టరీలో ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గోల్ కొట్టిన 5వ ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాదు, 2010 ఫైనల్లో ఆండ్రెస్ ఇనియెస్టా తర్వాత స్పెయిన్ తరపున ఎక్స్‌ట్రా టైమ్‌లో గోల్ కొట్టిన రెండో బార్సిలోనా ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

55
అవార్డుల పంట.. ఎవరికి ఏది దక్కింది?

ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్లో విన్నింగ్ గోల్ కొట్టిన స్పెయిన్ స్టార్ ఫెరాన్ టోరెస్‌కు 'ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. స్పెయిన్‌కే చెందిన 19 ఏళ్ల పావు కుబార్సి 'బెస్ట్ యంగ్ ప్లేయర్' అవార్డును అందుకోగా, ఉనై సిమోన్ టోర్నమెంట్‌లో 'బెస్ట్ గోల్‌కీపర్' అవార్డును కైవసం చేసుకున్నాడు.

స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ రోడ్రీకి టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడినందుకు 'బెస్ట్ ప్లేయర్' (గోల్డెన్ బాల్) అవార్డు లభించింది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే టోర్నమెంట్‌లో అత్యధికంగా 10 గోల్స్ చేసి 'గోల్డెన్ బూట్' అవార్డును దక్కించుకున్నాడు. మెస్సీ 8 గోల్స్‌తో ఈ రేసులో వెనుకబడ్డాడు. అంతకుముందు జరిగిన క్లోజింగ్ సెరెమనీలో పాప్ స్టార్ జస్టిన్ బీబర్, షకీరా, బీటీఎస్, పోస్ట్ మెలోన్, ఐషోస్పీడ్ తమ పర్ఫార్మెన్స్‌లతో స్టేడియాన్ని ఊపేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మ్యాచ్‌ను లైవ్‌గా వీక్షించారు.

Read more Photos on
click me!

Recommended Stories