పసుపు కూరకు మంచి రంగు, రుచిని అందిస్తుంది. అందుకే మనం ప్రతిరోజూ ప్రతి ఒక్క కూరలో ఖచ్చితంగా పసుపును వేస్తుంటాం. ఈ పసుపు కూరకు మంచి రంగును ఇవ్వడమే కాదు.. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తెలుసా? పసుపును రోజూ తీసుకోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉంటాం. కానీ కొన్ని రకాల కూరల్లో పసుపును వేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎదుకంటే పసుపు వల్ల ఆ కూర రుచి, రంగు రెండూ నాశనమవుతాయి.
పసుపును ఏయే కూరల్లో వేయకూడదు
వంకాయ కూరలో పసుపు వేయొద్దు
అవును వంకాయ కూరలో పసుపు వేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కూరలు మంచి రంగు, రుచి రావడానికే పసుపు వేస్తుంటారు. కానీ వంకాయ కూరలో మాత్రం పసుపును వేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పసుపు వల్ల వంకాయ కూర రుచి, ఆకృతి నాశనమవుతాయి. అంతేకాదు పసుపు వల్ల వంకాయ కూర చేదుగా కూడా అవుతుంది. అందుకే వంకాయలో పసుపు వేయొద్దని చెప్తారు.
మెంతికూరలో పసుపు వేయొద్దు
వంకాయలోనే కాదు మెంతికూరలో కూడా పసుపును వేయకూడదు. ఎందుకంటే మెంతి కూర ఇప్పటికే కొంచెం చేదుగా ఉంటుంది. దీనిలో పసుపును వేస్తే ఆ కూర మరింత చేదుగా అవుతుంది. నిజం చెప్పాలంటే మెంతికూరలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి చేదుగా ఉన్న కూరలో పసుపును వేసి మరింత చేదుగా చేయకపోవడమే మంచిది.
బచ్చలికూరలో వేయొద్దు
చలికాలంలో బచ్చలికూరను ఎక్కువగా తింటుంటారు. ఈ ఆకు కూరలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిజానికి బచ్చలికూర చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ కూరలో మీరు పసుపును వేస్తే గనుక ఈ రుచి పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాల కూర వంటి ఆకు కూరల్లో పసుపును వేయకూడదంటారు. ఎందుకంటే పసుపు వల్ల ఈ ఆకు కూరలు మరింత నల్లగా కనిపిస్తాయి.
mustard greens
ఆవాల ఆకుకూరల్లో పసుపు వాడకూడదు
చలికాలంలో ఆవాల ఆకుకూరలను కూడా ఎక్కువగా తింటుంటారు. అయితే ఈ ఆకు కూరలో కూడా పసుపును వేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో పసుపును వేస్తే దాని టేస్ట్ మొత్తం మారుతుంది. ఆవాలు ఆకుల్లో ఇప్పటికే కొద్దిగా ఉన్న ఆస్ట్రిజెంట్ పసుపు వల్ల మరింత పెరుగుతుంది. దీనివల్ల ఈ కూర టేస్ట్ తగ్గుతుంది.
ఉల్లికాడల కూర
ఉల్లికాడల కూరలో కూడా పసుపును వాడకూడదు. ఎందుకంటే ఈ కూరలో పసుపును వేస్తే దాని రుచి చెడిపోతుంది. ఉల్లికాడల కూర టేస్టీగా కావాలంటే మాత్రం ఈ కూరలో మీరు పసుపును వేయకపోవడమే మంచిది.