రాత్రిపూట కిస్ మిస్ నానపెట్టి.. ఉదయాన్నే ఆ నీరు ఎందుకు తాగాలి..?

First Published | Apr 24, 2021, 1:09 PM IST

నార్మల్ కిస్ మిస్ అని స్వీట్లలో వాడుతుంటారు. ఈ డ్రైట్ ఫ్రూట్ ని విడిగా తినడం కంటే.. నానపెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయట.

ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై అందరికీ దృష్టి పెరిగింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి అడుగుపెట్టిన తర్వాత.. మరింత ఎక్కువ దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆరోగ్యం కోసం అందరూ... రాత్రిపూట కిస్ మిస్ లు నానపెట్టుకొని.. ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు..
undefined
అసలు ఆ నీరు ఎందుకు తాగాలి..? తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..కేవలం నీరు తాగి ఆ నానిన కిస్ మిస్ లను పడేయకుండా వాటిని కూడా తినాలట. దాని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
undefined

Latest Videos


నార్మల్ కిస్ మిస్ అని స్వీట్లలో వాడుతుంటారు. ఈ డ్రైట్ ఫ్రూట్ ని విడిగా తినడం కంటే.. నానపెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయట.
undefined
మరీ ముఖ్యంగా.. అజీర్తి, అరుగుదల, మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారి పై సత్వర పరిష్కారం చూపిస్తుందట.
undefined
అంతేకాకుండా... ఎండు ద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల శరీరంలోని సాల్ట్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.
undefined
మలబద్దకంంతో ఉన్నవారు ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల..ఆ సమస్య తాగడం తోపాటు.. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
undefined
అంతేకాదు.. ఈ నీరు ఎముకకు బలాన్ని చేకూర్చడానికి కూడా సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ లెవల్స్ కూడా పెరుగుతాయి.
undefined
ఎండుద్రాక్షలోని ఫైబర్ జీర్ణవ్యవస్థ నుండి టాక్సిన్స్ హానికరమైన పదార్థాలను బహిష్కరించడానికి సహాయపడుతుంది. అదనంగా, ఎండుద్రాక్షలో పొటాషియం మెగ్నీషియం ఉంటాయి. ఇవిశరీరంలోని యాసిడ్స్ తగ్గించడానికి, టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడతాయి
undefined
ఎండుద్రాక్షలోని విటమిన్ బి,సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఎముక బలాన్ని పెంచడానికి అవసరమైన బోరాన్ అనే సమ్మేళనం ఎండుద్రాక్షలో చాలా ఎక్కువగా ఉంటుంది.
undefined
click me!