వీళ్లు పెసర పప్పును తినకూడదు

First Published | Oct 31, 2024, 10:56 AM IST

పెసర పప్పు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో ఉండే రకరకాల పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కానీ కొంతమంది మాత్రం పెసరపప్పును పొరపాటున కూడా తినకూడదు. 

పెసరపప్పును వారానికి మూడు నాలుగు సార్లు తినేవారు కూడా ఉన్నారు. ఈ పప్పుతో చేసిన ఏ కూరైనా సరే బలే టేస్టీగా ఉంటుంది. నిజానికి ఈ పప్పులు టేస్టీగానే కాదు.. ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలుచేస్తుంది. 
 

పెసర పప్పులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. అందుకు ఈ పప్పును జనాలు ఎక్కువగా తింటారు. అయితే ఈ పెసర పప్పు అందరికీ మేలు చేస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఈ పప్పు కొంతమందికి అస్సలు మంచిది కాదు. అసలు ఈ పప్పును ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అపానవాయువు 

అపానవాయువు (పిత్తులు) సమస్య ఎక్కువగా ఉన్నవారు పెసర పప్పును తినకపోవడమే మంచిది. ఎందుకంటే పెసరపప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే మీకు ఇప్పటికే గ్యాస్ లేదా అపానవాయువు సమస్య గనుక ఉంటే.. ఈ పప్పును తినకపోవడమే మంచిది. ఈ పప్పు మొలకలను కూడా తినకూడదు. 
 


తక్కువ రక్తపోటు

బీపీ ఎక్కువగా ఉంటేనే కాదు.. తక్కువగా ఉన్నా సమస్యే. బీపీ తక్కువగా ఉంటే మైకం, బలహీనంగా అనిపించడంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే మీకు ఇప్పటికే బీపీ తక్కువగా ఉంటే.. పెసరపప్పును తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ పప్పును తింటే మీ బీపీ మరింత తగ్గుతుంది. 

మూత్రపిండాల్లో రాళ్ళు

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా పెసరపప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పప్పుల్లో ఉండే ప్రోటీన్, ఆక్సలేట్ మూత్రిపండాల్లో రాళ్లను మరింత పెంచుతాయి. కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ఈ పప్పును తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. 
 

తక్కువ బ్లడ్ షుగర్ 

రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు కూడా పెసరపప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పప్పులో ఉండే లక్షణాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను మరింత తగ్గించేస్తాయి. దీనివల్ల మీ సమస్య మరింత పెరుగుతుంది. 

ఎక్కువ యూరిక్ ఆమ్లం 

పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను బాగా పెంచుతుంది. అందుకే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు పెసరపప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పెసరపప్పు ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యలు

ఏది ఎక్కువ తిన్నా సమస్యలు వస్తాయన్నది నిజం. అలాగే పెసరపప్పును ఎక్కువగా తింటే కూడా మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మైకము, వికారం, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

Latest Videos

click me!