వీళ్లు రాత్రిపూట అన్నం తినకూడదు

First Published Oct 30, 2024, 2:09 PM IST

మనలో చాలా మంది రోజుకు మూడు సార్లు అన్నాన్ని తింటుంటారు. కానీ రాత్రిపూట మీరు అన్నాన్ని తింటే ఏమౌతుందో తెలుసా? 

అన్నం

ఇండియాలో అన్నమే ప్రధాన ఆహారం. అందుకే మన దేశంలో చాలా మంది రోజుకు మూడు పూటలా అన్నాన్ని తింటుంటారు. అన్నంతో బిర్యానీ, పులిహోర, పులావ్ వంటివి ఎన్నో చేసుకుని తింటుంటారు. నిజానికి అన్నం వండటం చాలా సులువు. తొందరగా కూడా అవుతుంది. అందులోనూ అన్నం తింటేనే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. 

అందుకే చాలా మంది అన్నాన్ని బాగా తింటుంటారు. నిజానికి అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.అలాగే దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

అన్నం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట అన్నాన్ని తినకపోవడమే మంచిది. ఎందుకంటే వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరంలో గ్లూకోజ్‌గా మారి మనకు శక్తినిస్తాయి. కానీ మన శరీరానికి ఎక్కువ శక్తి అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు అన్నాన్ని ఎక్కువగా తింటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి, ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. .

అన్నంలో  ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. కానీ మనం తినే వైట్ రైస్ లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండవు. ఈ అన్నాన్ని ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

అయితే అన్నంలోని గ్లైసెమిక్ ఇండెక్స్ ఆ బియ్యం రకం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని తెల్ల రకాల అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయితే బ్రౌన్ రైస్‌లో మాత్రం జీఐ తక్కువగా ఉంటుంది. 

Latest Videos


అన్నం

రాత్రి అన్నం తినడం మంచిదేనా ?

రాత్రిపూట కొద్దిగా అన్నం తినడం వల్ల ఎలాంటి సమస్యా లేదు. కానీ వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అలాగే మీరు బరువు కూడా బాగా పెరుగుతారు. అంతేకాదు ఇది మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన కూడా పడేస్తుంది. 

అంతేకాదు అన్నం మన శరీరంపై చల్లని ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి రాత్రిపూట అన్నం తింటే మీ శరీరం చల్లగా అయ్యి జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. అలాగే రాత్రిపూట అన్నం తిన్న కొంతమంది ముఖం ఉదయానికల్లా ఉబ్బుతుంది. 

అన్నం

రాత్రిపూట అన్నం ఎవరు తినకూడదు?

డయాబెటిస్ ఉన్నవారు...

డయాబెటీస్ పేషెంట్లు రాత్రిపూట అన్నం అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. అందుకే వీళ్లు రాత్రిపూట పొరపాటున కూడా అన్నం తినకూడదంటారు. అయితే షుగర్ ఉన్నవారు రాత్రిపూట బ్రౌన్ రైస్ ను కొంచెం తినొచ్చు. 

బరువు తగ్గాలనుకునేవారు...

 బరువు తగ్గాలనుకునే వారు కూడా రాత్రిపూట అన్నాన్ని తినకపోవడమే మంచిది. ఎందుకంటే అన్నంలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. ఇవి మీ కడుపును తొందరగా నింపుతాయి. మీరు బరువు తగ్గేలాచేస్తాయి. 

ఎక్కువగా కూర్చుని ఉండేవారు

పొద్దంతా కూర్చొని ఉండేవారు కూడా రాత్రిపూట అన్నాన్ని తినకపోవడమే మంచిది. అలాగే వ్యాయామం చేయని వారు కూడా రాత్రిళ్లు అన్నాన్ని తినకూడదు. ఎందుకంటే అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు మీ బరువును బాగా పెంచుతాయి. మీ పొట్ట సైజును కూడా పెంచుతాయి. ఒకవేళ తిన్నా తక్కువగా తినాలి. 

అన్నం

అన్నాన్ని మీరు మధ్యాహ్నం ఎంచక్కా తినొచ్చు. ఎందుకంటే ఇది మీ రోజువారి పనులను చేసుకోవడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. కావాలంటే  మీరు ఉదయం కూడా అన్నాన్ని తినొచ్చు. కానీ రాత్రిపూట  తినకపోవడమే మంచిది. ఉదయం లేదా మధ్యాహ్నం అన్నం తింటే మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

వ్యాయామం తర్వాత...

వ్యాయామం తర్వాత మన శరీరానికి శక్తి అవసరమవుతుంది. దీనికి అన్నం మంచిది.  మీకు తెలుసా? వ్యాయామం తర్వాత అన్నం తింటే ఒంట్లో శక్తి పెరుగుతుంది, కండరాలు త్వరగా కోలుకుంటాయి. 

అయితే రాత్రిపూట తేలికైన ఆహారాన్ని తినడం మంచిది. ఎందుకంటే హెవీ ఫుడ్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఇది మీ శరీరంపై ఒత్తిడిని బాగా పెంచుతుంది. రాత్రిపూట చల్లని ఆహారాలు తింటే కఫం పెరుగుతుంది. అందుకే రాత్రిపూట వేడి వేడిగా తినడం మంచిది.

click me!