ఎండు కొబ్బరి.. మనం ఏదో ఒక రూపంలో వంటలో భాగం చేసుకుంటూ ఉంటాం. కానీ దీని వాడకం చాలా తక్కువగా ఉంటుంది. చాలా మందికి ఎండు కొబ్బరి విలువ తెలీదు. దీనిలో ఉన్న పోషకాలు తెలిస్తే.. దీనిని ఇంత నిర్లక్ష్యం చేయరు.
ఈ ఎండు కొబ్బరిలో విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, పాస్పరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి.. ఈ ఎండు కొబ్బరిని రోజూ మన డైట్ లో భాగం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
ఎవరైతే రక్త హీనతతో బాధపడుతున్నారో.. వాళ్లు కనుక రోజూ తమ డైట్ లో భాగం చేసుకుంటే ఈ సమస్య ఉండదు. కొబ్బరిలో ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరుగుదలకు సహాయపడుతుంది. అతి తక్కువ రోజుల్లోనే అనీమియా సమస్య ఉండదు.
ఎండు కొబ్బరిలో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సైతం పుష్కలంగా ఉంటాయి. నీరసం లాంటి సమస్య ఉండదు. శరీరాన్ని బలంగా మారుతుంది. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ మన దరి చేరకుండా కాపాడటంలో ఎండు కొబ్బరి సహాయం చేస్తుంది.
NDA INDIA Coconut
గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ ఎండు కొబ్బరి మనకు సహాయపడుతుంది. రోజూ ఎండు కొబ్బరి తింటే.. మీ గుండె ఆరోగ్యంగా ఉండటం గ్యారెంటీ. అయితే... మరీ ఎక్కువ కాకుండా.. మితంగా తినడం మంచిది.
ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే.. మీరు కనుక ఎండు కొబ్బరి తినడం మొదలుపెడితే... అరుగుదల సమస్య ఉండదు. పాన్ క్రియాటీస్ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
ఎండు కొబ్బరిలో కాల్షియం ఉంటుంది. దీనిని రోజూ తినడం వల్ల.. మన శరీరానికి కావాల్సిన కాల్షియాన్ని అందిస్తుంది. జాయింట్ పెయిన్స్ తగ్గించడంలో, స్వెల్లింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది.ఆర్థరైటిస్ సమస్యకు బెస్ట్ పరిష్కారం ఇది.
Coconut
ఇక.. ఈ ఎండు కొబ్బరిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల.. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా.. ఫుడ్ క్రేవింగ్స్ రావు. మంచిగా.. కడుపు నిండిన అనుభూతితో ఇతర ఫుడ్స్ తినడం తగ్గిస్తాం. దీని వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఎండు కొబ్బరి మనకు ఆరోగ్యం మాత్రమే కాదు.. అందాన్ని కూడా అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలోనూ సహాయపడుతుంది. చర్మం మృదువుగా , స్మూత్ గా మారుతుంది.