నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదా..? ఈ విషయాలు మీకోసమే.. !

First Published | Mar 6, 2021, 1:19 PM IST

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మాంసాహారం తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం మరియు తొమ్మిది వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.

మనలో చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఉండే ఉంటారు. వారానికి ఒకసారి నాన్ వెజ్ తినేవారు కొందరైతే.. ప్రతిరోజూ అసలు నాన్ వెజ్ లేనిది కనీసం ముద్ద కూడా దిగని జాబితా కూడా ఉంటుంది. అలాంటివాళ్లు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
undefined
నాన్ వెజ్ తింటే.. పొట్ట అంతా నిండినట్లుగా ఉంటుంది. మాంసాహారంలో ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి మరియు జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి అవసరం.అయితే, కొంతమంది తమ రోజువారీ ఆహారంలో మాంసాన్ని వాడటానికి ఇష్టపడతారు, ఇది వారి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined

Latest Videos


ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మాంసాహారం తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం మరియు తొమ్మిది వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.
undefined
అధ్యయనం ప్రకారం, ఆహారంలో మాంసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులు, మాంసాహారాల మధ్య సంబంధాన్ని UK పరిశోధకులు కనుగొన్నారు.
undefined
క్రమం తప్పకుండా మాంసం తినేవారికి గుండె జబ్బులు, డయాబెటిస్, న్యుమోనియా లాంటి జబ్బులు త్వరగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం ప్రేగు క్యాన్సర్‌కు దారితీస్తుందని కనుగొన్నారు, అయితే మొదటిసారిగా గుండె జబ్బులు, డయాబెటిస్ , న్యుమోనియా వంటి వ్యాధులు కూడా అధికంగా మాంసాహారం తినడం వల్ల వస్తాయట.
undefined
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ పరిశోధనలో వారానికి మూడు రోజులు మాంసం లేదా పౌల్ట్రీ మాంసం తినడం వల్ల 9 రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని ధ్రువీకరించడం గమనార్హం.
undefined
దాదాపు 8 సంవత్సరాలపాటు.. 5 మిలియన్ల మంది ప్రజల పై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
undefined
మాంసం తినని వారితో పోల్చితే వారానికి మూడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ మాంసం తినేవారి ఆరోగ్యం అంత సరిగా ఏమీ లేదని వారు చెబుతున్నారు.
undefined
ప్రతిరోజూ 70 గ్రాముల ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తికి డయాబెటిస్ వచ్చే అవకాశం 30 శాతం ఉంటే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15 శాతం పెరుగుతుందని యూనివర్శిటీ న్యూఫీల్డ్ ఆరోగ్య విభాగం నిపుణులు తెలిపారు.
undefined
అదేవిధంగా, ప్రతిరోజూ 30 గ్రాముల పౌల్ట్రీ మాంసాన్ని తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 14 శాతం, గ్యాస్ట్రో-ఓసోఫాగియల్ రిఫ్లక్స్ 17 శాతం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.
undefined
click me!