eating food
మన శరీరానికి ఆహారం చాలా ముఖ్యం. ఆహారం తీసుకోకపోతే మన శరీరానికి అవసరమైన శక్తి లభించదు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారం అవసరమే. అయితే..మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా.. భోజనం తినే విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. మరి.. ఎలాంటి తప్పులు చేయకూడదో, ఏ తప్పులు.. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆహారం తీసుకునే సమయంలో చేయకూడని తప్పులు ఇవే…
ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం ఒక పద్దతి. కానీ, చాలా మంది ఆకలి లేకపోయినా ఆహారం తింటూ ఉంటారు. ఇలా ఆకలి లేకపోయినా తినడం వల్లే అధిక బరువు పెరిగిపోతూ ఉంటారు. అంతేకాకుండా.. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయట. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నిజంగా ఆకలి అనిపించినప్పుడు మాత్రమే భోజనం చేయాలట. ఆకలేసినప్పుడు మాత్రమే తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. మీరు నిజంగా ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే మీరు పోషకాలను బాగా గ్రహిస్తారు.అప్పుడు మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది.
ఇక చాలా మంది చేసే మరో తప్పు.. హడావిడిగా ఆహారం తినడం., ఇది ఏమాత్రం సరికాదని నిపుణులు చెబుతున్నారు. తినడం ప్రారంభించే ముందు, 5 నుండి 6 డీప్ బ్రీత్ తీసుకోవడం అవసరం, తద్వారా మీరు ప్రశాంత స్థితిలోకి రావచ్చు. ఇలా చేయడం వల్ల మీరు జీర్ణక్రియకు అవసరమైన పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తారు. ఇది ఆక్సిజన్ మీ కణాలకు చేరుకోవడానికి సహాయపడుతుంది, ఈ విధంగా మీ మనస్సు, శరీరాన్ని శాంతపరచడం ద్వారా, మీరు పోషకాలను గ్రహించే మీ శరీర సామర్థ్యాన్ని పెంచుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
ఆహారపు అలవాట్లు
చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, మనం తరచుగా ఆహారం గురించి ఫిర్యాదు చేస్తాము. నేను ఆ ఫుడ్ తినను, ఈ ఫుడ్ తినను అని కొందరు అంటారు. కొందరేమో.. ఇది నిన్ననే తిన్నాను.. మళ్లీ ఈరోజు కూడా ఇదే తినాలా అని అంటూ ఉంటారు. కానీ.. ఫుడ్ దొరకడే అదృష్టంగా భావించాలి. ఆహారం గురించి ఫిర్యాదు చేయడానికి బదులుగా, కృతజ్ఞతలు తెలియజేయండి. మీ ఆహారాన్ని మెచ్చుకోండి, ఇది జీర్ణక్రియ, మానసిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆహారం తిన్న తర్వాత మీరు మంచి అనుభూతి చెందుతారు. సంతోషంగా ఉండటం వల్ల శరీరం ఆహారాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది.
ఈ చిన్న చిన్న మార్పులను మీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల మీ జీర్ణశక్తి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.