జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మాత్రమే కాదు.. విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ రెండూ మన చర్మం ముడతలు పడకుండా, వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుతుందట. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేయడంలో సహాయం చేస్తుంది.
జీలకర్రలో టెర్పెనస్, ఫ్లేవనాయిడ్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు చర్మ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మానికి కొత్త మెరుపును తెస్తుంది. మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు.