మామిడి ఆకులతో ఇన్ని ఉపయోగాలున్నాయని తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!

First Published | Apr 26, 2024, 10:12 AM IST

కేవలం సమ్మర్ సీజన్ లో మాత్రమే దొరికే మామిడి పండ్ల కంటే... ఎప్పుడూ అందుబాటులో ఉండే.. మామిడి ఆకులతో విపరీతమైన ఉపయోగాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా..? 

సాధారణంగా మనం మామిడి పండు తింటాం. పచ్చి మామిడి కాయతో అయితే ఊరగాయ చేసుకుంటాం. కానీ.. మామిడి ఆకులను పెద్దగా పట్టించుకోం. మహా అంటే.. ఏదైనా శుభకార్యం సమయంలో.. మామిడి ఆకులను తీసుకువచ్చి... గుమ్మానికి కడుతూ ఉంటాం. లేదంటే పూజలోకి వాడతారు. అంతకు మించి మామిడి ఆకులను పెద్దగా మనం వాడేది ఏమీ లేదు. కానీ... కేవలం సమ్మర్ సీజన్ లో మాత్రమే దొరికే మామిడి పండ్ల కంటే... ఎప్పుడూ అందుబాటులో ఉండే.. మామిడి ఆకులతో విపరీతమైన ఉపయోగాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా..? మీకు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. అసలు మామిడి ఆకులతో ఉన్న ఉపయోగాలు తెలిస్తే... పండు కంటే.. ఆకులే కావాలి అంటారు. మరి.. ఆ ప్రయోజనాలేంటో మనమూ ఇప్పుడు తెలుసుకుందాం..
 

1.మామిడి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. అంతేకాదు..వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం అందంగా కనపడటానికి సహాయపడతాయి. అంతేకాదు... ఏవైనా గాయాలు అయినా.. వాటిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
 


mango leaves

2.మామిడి ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి.  ఇవి కొలాజిన్ ప్రొడక్షన్ కి ఎక్కువగా సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన, మృదువైన మెరిసే జుట్టుకు ఎంతగానో సహాయపడతాయి.

3.డయాబెటిక్ పేషెంట్స్ మామిడి పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే.. అలాంటివారికి మామిడి ఆకులు మాత్రం దివ్య ఔషధంలా పని చేస్తాయి. ఇన్సలిన్ రెసిస్టెన్స్ చేయడంలో మామిడి ఆకులు సహాయం చేస్తాయి. చాలా పరిశోధనల్లో ఈ విషయం నిర్థారితమైంది.

4. ఈ ఆకులు బీపీ పేషెంట్స్ కి కూడా  చాలా బాగా సహాయం చేస్తాయట.  మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.  ఈ ఆకుల ద్వారా హై బీపీని కంట్రోల్ చేయవచ్చట. అయితే.. దీనిని నిర్థారించే పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉంది.

5.అంతేకాదు.. ఈ మామిడి ఆకులు బరువు తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.  ముఖ్యంగా ఒబేసిటీ సమస్యను తగ్గిస్తుంది. శరీరంలోని ఫ్యాట్ కరిగించడంలో కీలకంగా పని చేస్తుంది.

6.కడుపులో అల్సర్స్ తగ్గించడంలోనూ.. ఎక్కువగా వచ్చే ఎక్కిళ్లను కంట్రోల్ చేయడంలోనూ ఈ మామిడి ఆకులు బాగా పని చేస్తాయి. మామిడి ఆకుల్లో యాంటీ ఇనఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయట. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.
 

7.మామిడి ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని రేపటి నుంచి వీటిని తీసుకోవడం మొదలుపెట్టకండి. ఎందుకంటే ఈ మామిడి ఆకులు అందరికీ సూట్ అవ్వవు. ముఖ్యంగా మీరు ఏ వ్యాధి కైనా ట్రీట్మెంట్ తీసుకుటుంటే.. ఆ మందులు ఆపేసి మాత్రం ఇవి తీసుకోవడం మొదలుపెట్టవద్దు. వైద్యుల సలహా లేకుండా  వేటిని తీసుకోవడం మంచిది కాదు. 

Latest Videos

click me!