మీరు కొనే మామిడి పండ్లు సహజంగా పండినవా? లేక కెమికల్స్ తో పండించినవా? ఇలా గుర్తించండి..

First Published | May 4, 2023, 10:34 AM IST

ఇది మామిడి పండ్ల సీజన్. ఈ సీజన్ పోతే మళ్లీ మామిడి పండ్లను తినడానికి మళ్లొచ్చే ఎండాకాలం వరకు వెయిట్ చేయాలి. మామిడి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది మామిడి పండ్లను కెమికల్ తో పండేలా చేస్తారు. వీటిని తింటే ఎన్నో సమస్యలు వస్తాయి. 

Mangoes

ముందే ఇది మామిడి పండ్ల సీజన్. ఇంకేముంది ఏ మార్కెట్ లో చూసినా రకరకాల మామిడి పండ్లు నోరూరిస్తాయి. అయితే మార్కెట్ లో జ్యూసీ మామిడిపండ్లకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు వీటిని కృత్రిమంగా రసాయనాలతో ఇంజెక్ట్ చేసి త్వరగా పండించి అమ్ముతున్నారు. కానీ ఇలాంటి మామిడి పండ్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి మామిడి పండ్లను కొనకూడదు. మరి ఇలాంటి మామిడి పండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Mango

ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు?

మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్ తో ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఎసిటిలిన్ వాయువును రిలీజ్ చేస్తుంది. ఇది మామిడి పండ్లు త్వరగా పండేలా చేస్తుంది. కానీ ఇలాంటి మామిడి పండ్లను తింటే చర్మపు చికాకు, శ్వాసకోశ సమస్యలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు పండ్ల వ్యాపారులు 'ఇథిలీన్ ట్రీట్ మెంట్ 'ను కూడా ఉపయోగిస్తారు. దీనిలో పండ్లను ఇథిలీన్ వాయువును ఉపయోగించి పండ్లు త్వరగా పండేలా చేస్తారు.
 


రంగును చూడండి

మామిడి పండ్లను కొనేటప్పుడు మామిడి పండ్ల రంగును చూడటం మర్చిపోకండి. ఎందుకంటే మామిడి పండ్లను రసాయనాలతో పండించినప్పుడు దానిపై అక్కడక్కడ పచ్చని మచ్చలు ఉంటాయి. ఇలాంటి మచ్చలున్న మామిడి పండ్లను కొనకండి.

సైజు చూడండి

పండ్ల రంగే కాదు మామిడి ఆకారం కూడా ఎలా ఉందో చూడండి. మామిడి పండ్లను రసాయనాలతో పండిస్తే వాటి పరిమాణాన్ని బట్టి కూడా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. రసాయనాలతో పండిన మామిడి పండ్లు పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. అలాగే వీటిలో ఎక్కువ భాగం రసం ఉంటుంది. ఇదేకాదు తెలుపు లేదా నీలం రంగు మచ్చలున్న మామిడి పండ్లను కూడా కొనకండి. ఎందుకంటే వీటిని కెమికల్స్ తో పండిస్తారు. 

డిప్ టెస్ట్

మామిడి పండ్లు కొనేటప్పుడు ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను  వేయండి. వీటిలో ఏ మామిడి పండ్లు నీటిలో మునుగుతున్నాయి..? ఏవి పైకి తేలుతున్నాయో గమనించండి. నీటిలో మునిగిన మామిడి పండ్లు సహజంగా పండుతాయి. అయితే పైన తేలిన మామిడి పండ్లు కెమికల్స్ తో వండినట్టు అర్థం. అందుకే ఇలాంటి పండ్లను కొనకండి.

ప్రెస్ టెస్ట్

పండిన, తీపి మామిడి పండ్లను గుర్తించడం చాలా సులభం. మామిడి పండ్లను కొనేటప్పుడు వాటిని తేలికగా నొక్కి చూడండి. మామిడి మెత్తగా ఉంటే అవి పండినట్టుగా భావిస్తారు. కానీ మీరు మామిడిని నొక్కినప్పుడు కొన్ని చోట్ల మామిడి గట్టిగా అనిపిస్తే అవి సరిగా పండలేదని, వీటిని రసాయనాలతో పండించి అమ్ముతున్నారని అర్థం చేసుకోండి. 
  

Latest Videos

click me!