పాలలో వీటిని కలుపుకుని తాగుతున్నారా? అయితే మీకు జలుబు, అలెర్జీతో పాటు ఎన్నో సమస్యలొస్తాయో..!

First Published | May 2, 2023, 11:31 AM IST

పాలు మంచి పోషకాహారం. రోజూ పాలను తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. పాలలోని పోషకాలు మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ పాలలో కొన్ని ఆహారాలను కలిపి తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా కలిపి తాగితే అలెర్జీ నుంచి జలుబు వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంతకీ పాలలో దేన్ని కలిపి తాగకూడదంటే..? 
 

అరటిపండ్లు

పాలతో పాటుగా అరటి పండ్లను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. పాలు, అరటి పండ్లు రెండింట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పాలలో అరటిపండును వేసి తింటే మాత్రం చాలా మందికి అలెర్జీ కలుగుతుంది. 

మాంసాహారం

మీరు మాంసం, చేపలు లేదా, గుడ్లను తింటారా? అయితే వీటిని ఎట్టి పరిస్థితిలో పాలతో కలిపి తినకండి. దీనిలో ఏ ఒక్కటి తిన్నా.. ఈ రెండు ఆహారాల మధ్య కొన్ని గంటల గ్యాప్ తీసుకోండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. 
 

Latest Videos


Image: Getty

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు అయిన నారింజ, నిమ్మకాయ, ఉసిరి  కాయ వంటి పుల్లని పండ్లలో విటమిన్ సి తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ వీటిని ఎప్పుడూ కూడా పాలతో కలిపి తినకూడదు. 

ముల్లంగి

ముల్లంగి డయాబెటీస్ పేషెంట్లతో పాటుగా ఇతరులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే ఈ ముల్లంగిని పాలతో కలిపి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రెండింటి కలయిక జీర్ణం కావడం చాలా కష్టం.

పుచ్చకాయలు

సమ్మర్ ఫ్రూట్ అయిన పుచ్చకాయ మనల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మన మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. కానీ పుచ్చకాయను పాలతో కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఎందుకంటే ఈ రెండు ఆహారాల స్వభావం భిన్నంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

Image: Getty Images

సాదా పాలు

పాలు ఆరోగ్యకరమైన ఆహారం. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పాలకు ఏవీ కలపకండి. పాలు ఒక్కటి తాగినా ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అందుకే సాదా పాలనే తాగండి. 

పసుపు పాలు

సాదా పాలు తాగాలనిపించకపోతే మీరు పాలలో కొంచెం పసుపును కలిపి తాగొచ్చు. నిజానికి పసుపు పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు కలిపిన  పాలను తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. అయితే పాలలో  కొన్ని డ్రై ఫ్రూట్స్ ను వేసి కూడా తాగొచ్చు. 

click me!