శృంగార సామర్థ్యం నుంచి పునరుత్పత్తి ఆరోగ్యం వరకు.. పుట్టగొడుగులను తింటే ఎన్ని లాభాలున్నాయో..!

First Published | May 1, 2023, 12:14 PM IST

హార్మోన్ల అసమతుల్యత వల్ల లిబిడో తగ్గడం, వంధ్యత్వంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే పుట్టగొడుగులను తింటే హార్మోన్లు తిరిగి సమతుల్యం అవుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 

Image: Getty Images


ఇర్రెగ్యుటర్ పీరియడ్స్, అలసట, తక్కువ లిబిడో, ఉబ్బరం, పీరియడ్స్ తిమ్మిరి, అకస్మాత్తుగా బరువు పెరగడం, ఊబకాయం వంటివన్నీ హార్మోన్ల అసమతుల్యతకు సంకేతాలు. హార్మోన్లు మన శరీరంలో అనేక శారీరక ప్రక్రియలకు అవసరం. అవి అసమతుల్యతకు గురైనప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

మన ఆహారంలో ఉండే పోషకాలను ఈ సమస్యలను తగ్గిస్తాయి. అందులో పుట్టగొడుగులు ఒకటి. కొన్ని జాతుల పుట్టగొడుగులు హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. దీంతో పునరుత్పత్తి అవయవాలతో సంబంధం ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. 
 

Image: Getty Images

హార్మోన్ల అసమతుల్యత ఎందుకు వస్తుంది?

హార్మోన్లు మన శరీరంలోని వివిధ గ్రంథులు, అవయవాల ద్వారా తయారవుతాయి. మందులు, ఆహారం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడితో సహా అనేక అంశాలు హార్మోన్ల స్రావాన్ని ప్రభావితం చేస్తాయి.

పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, వంధ్యత్వం, ప్రారంభ రుతువిరతి వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత కలుగుతుంది. స్త్రీ సెక్స్ హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ లు అసమతుల్యంగా మారితే శారీరక, మానసిక, రుతుస్రావ సమస్యలు వస్తాయి. ఆడవారు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ హార్మోన్లు సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యం.


mushrooms

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్ ప్రకారం.. పుట్టగొడుగులలో ఔషధ గుణాలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత కోసం సాంప్రదాయ చైనీస్ వైద్యంలో కార్డిసెప్స్ పుట్టగొడుగులను ఉపయోగించినట్టు కనుగొన్నారు. హార్మోన్ల కోసం పుట్టగొడుగులు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

యాంటీఆక్సిడేటివ్ లక్షణాలు

పుట్టగొడుగుల్లో యాంటీఅలెర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడేటివ్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది సైటోటాక్సిక్, ఇమ్యునోమోడ్యులేటింగ్, యాంటిడిప్రెసివ్, యాంటీహైపర్లిపిడెమిక్, యాంటీడయాబెటిక్, హెపాటోప్రొటెక్టివ్, న్యూరోప్రొటెక్టివ్, నెఫ్రోప్రొటెక్టివ్, ఆస్టియోప్రొటెక్టివ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
 

పీసీఓఎస్ లక్షణాలను తగ్గిస్తుంది

జర్నల్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్ ప్రకారం.. రీషి పుట్టగొడుగులను కొన్నిసార్లు పడకగదికి మాయా పుట్టగొడుగులు అని అంటారు. ఈ పుట్టగొడుగులు మహిళలు, పురుషుల సంతానోత్పత్తిని పెంచడానికి, శరీరం మొత్తం పనితీరును పెంచడానికి సహాయపడుతుంది.నిజానికి పుట్టగొడుగులలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది జననేంద్రియ అవయవాలపై పనిచేస్తుంది. దీంతో లైంగిక జీవితం మెరుగుపడుతుంది. ఇది ప్రధానంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ ను, సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుందని కనుగొనబడింది.

యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే సేజ్ పుట్టగొడుగులు

కోక్రాన్ లైబ్రరీ ప్రకారం.. సేజ్ పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తాయి. ఈ పుట్టగొడుగులు హార్మోన్లను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడతాయి. చాగా పుట్టగొడుగులు రక్తపోటును స్థిరీకరించడానికి, శక్తిని పెంచడానికి, ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడతాయి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి వీటిని ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు. 

రక్త నాళాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది

ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్ ప్రకారం.. ప్రతి రకం పుట్టగొడుగు పొటాషియానికి గొప్ప వనరు. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించే పోషకం. ఇందులో కోలిన్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి కాకుండా పుట్టగొడుగులలో థియామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి -6, విటమిన్ బి -12 తో సహా ఎన్నో ఇతర విటమిన్ బి కూడా ఉంటాయి. 
 

Mushroom

ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది

సేజ్ పుట్టగొడుగులు ఈస్ట్రోజెన్ హార్మోన్ పై మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి శరీరానికి సరైన మొత్తంలో ఈస్ట్రోజెన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. స్త్రీ హార్మోన్లను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడతాయి. ఇది కటి వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కటి వాపు ఎండోమెట్రియోసిస్, గర్భాశయ ఫైబ్రాయిడ్లు, డిస్మెనోరియా, కటి తాపజనక వ్యాధికి కారణమవుతుంది.

Latest Videos

click me!