చపాతీ, పూరీ కీ ఎంత పిండైనా ఐదు నిమిషాల్లో కలిపేయవచ్చు.. ఇదిగో ఇలా..!

Published : Jan 21, 2025, 11:43 AM IST

రోటీ, చపాతీ, పూరీ రుచి మొత్తం ఆ పిండి కలపడంలోనే ఉంటుంది. అయితే... కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడితే... చాలా ఈజీగా పిండి కలపొచ్చట. అదెలాగో చూద్దాం...

PREV
15
చపాతీ, పూరీ కీ ఎంత పిండైనా ఐదు నిమిషాల్లో కలిపేయవచ్చు.. ఇదిగో ఇలా..!


పూరీ తినడం ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా? చేసి పెట్టేవారు ఉండేలా కానీ.. ఇష్టంగా ఎన్నైనా తినేవాళ్లు చాలా మంది ఉంటారు. పూరీ, చపాతీ చేయడాన్ని కూడా చాలా మంది ఇష్టపడతారు. కానీ.. వచ్చిన చిక్కల్లా పిండి కలపడంతోనే.  కొద్ది పిండి అయితే పర్వాలేదు కానీ.. ఎక్కువ మంది కోసం పిండి కలపాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ.. రోటీ, చపాతీ, పూరీ రుచి మొత్తం ఆ పిండి కలపడంలోనే ఉంటుంది. అయితే... కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడితే... చాలా ఈజీగా పిండి కలపొచ్చట. అదెలాగో చూద్దాం...

25
Dough

1.పిండి కలిపేందుకు గోరువెచ్చని నీరు...
పిండిని తొందరగా, మెత్తగా కలుపుకోవడానికి మీరు నార్మల్ వాటర్ కాకుండా.. గోరువెచ్చని నీటిని వాడాలి. ఇలా కలపడం వల్ల పిండి చాలా మృదువుగా వస్తుంది. కలపడానికి మరీ ఎక్కువ సమయం కూడా తీసుకోదు. చాలా మృదువుగా వస్తుంది. దీనితో పూరీ, చపాతీ రుచి కూడా బాగుంటుంది. చల్లటి నీరు వాడితే పిండి చాలా గట్టిగా మారుతుంది. 

35

2. పాలు వాడండి
పిండిని పోషకమైనదిగా , రుచికరంగా చేయడానికి పాలు ఉపయోగించవచ్చు. ఇది పరాఠాలు, పూరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు రోటీని మృదువుగా చేయాలనుకుంటే పాలు కూడా ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటికి బదులుగా పాలు వాడండి.
అవసరమైన విధంగా పాలు వేసి పిండిని పిసికి కలుపుకోండి. పాలు పిండిని మృదువుగా చేస్తాయి మరియు మంచి రుచిని కూడా ఇస్తాయి. 

45

3. పిండిని కలిపే ప్రాసెసర్..
ఆధునిక పరికరాలను ఉపయోగించడం వల్ల సమయం ఆదా కావడమే కాకుండా శ్రమ కూడా తగ్గుతుంది. దీనితో అయితే.. చాలా ఈజీగా పిండి కలిపేయవచ్చు.

55

4. నూనె , నెయ్యిని ఉపయోగించండి
పిండిలో నూనె లేదా నెయ్యిని ఉపయోగించడం కూడా మంచి ఎంపిక. ఇది పిండిని మృదువుగా చేస్తుంది. ఇది పూరీలు , పరాఠాలకు చాలా మంచిది. రుచి బాగా పెరుగుతుంది. నార్మల్ గా పిండిని కలిపినట్లే కలిపుతూ అందులో నూనె కానీ, నెయ్యి కానీ ఒకటి రెండు స్పూన్లు చేరిస్తే సరిపోతుంది.
 

click me!

Recommended Stories