బరువును తగ్గించే పండ్లు ఇవి..

First Published | Feb 3, 2024, 2:11 PM IST

పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తింటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఒంట్లో ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది. అంతేకాదు కొన్ని రకాల పండ్లు మీరు బరువు తగ్గడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. అవేం పండ్లు అంటే..

పండ్లను రోజూ తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లను తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఎన్నో రోగాల ముప్పు కూడా తగ్గుతుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది అజీర్థి సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో రోజూ సతమతమయ్యేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ సమస్యలు మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మంచిదని చెప్తుంటారు. కొన్ని పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

ఆరెంజ్

ఆరెంజ్ పండు మన ఇమ్యూనిటీ పవర్ ను ఇట్టే పెంచుతుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఈ ఫైబర్స్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఆకలిని నియంత్రించడానికి సహాయపడతాయి. దీంతో మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు. 
 

Latest Videos


ఆపిల్

ఆపిల్ కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. దీన్ని తింటే ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఇకపోతే ఆపిల్స్ లో ఉండే పెక్టిన్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

దానిమ్మ

దానిమ్మ  మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. 
 


కివి

కివీలను అలాగే లేదా ఎండబెట్టి కూడా తినొచ్చు.  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కివి పండ్లను తినడం వల్ల మీరు సులువుగా బరువు తగ్గుతారు. అలాగే ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
 

జామకాయ
 
జామకాయను తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాయ మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అంతేకాదు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

click me!