ఎండాకాలంలో స్టామినా పెంచుకోవడానికి, ఫిట్ గా ఉండటానికి ఈ పండ్లను ఖచ్చితంగా తినండి

First Published | Apr 28, 2023, 2:27 PM IST

మండుతున్న ఎండల వల్ల ఒంట్లో వాటర్ కంటెంట్ తగ్గడమే కాదు స్టామినా కూడా తగ్గుతుంది. అయితే కొన్ని హైడ్రేటింగ్ పండ్లు మన స్టామినాను పెంచడమే కాకుండా మనల్ని ఫిట్ గా కూడా ఉంచుతాయి. అవేంటంటే..

పుచ్చకాయ

పుచ్చకాయలు ఎండాకాలంలోనే లభిస్తాయి. ఈ పండు చాలా టేస్టీగా ఉంటుంది. మండుతున్న ఎండల్లో ఈ పండు మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.  ఈ పండు పోషకాల బాంఢాగారం. దీనిలో పొటాషియం, లైకోపీన్, విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటుగా ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
 

Image: Getty Images

కొబ్బరి నీళ్లు

ఈ సహజ పానీయం హైడ్రేటింగ్, ఎలక్ట్రోలైట్లకు గొప్ప వనరు. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఈ వాటర్ మనల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో పొటాషియం కంటెంట్, సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రిఫ్రెష్ చేస్తాయి. ఎముకలు, దంతాలు దృఢంగా ఎదగడానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా కొబ్బరినీళ్లలో పుష్కలంగా ఉంటాయి.


chaas

 చాస్

రుచికరమైన సాంప్రదాయ భారతీయ పానీయాలలో చాస్ ఒకటి. పెరుగు, నీళ్లు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వంటి సుగంధ ద్రవ్యాలతో ఈ పానీయాన్ని తయారుచేస్తారు. ఇది శీతలీకరణ, రిఫ్రెషింగ్ పానీయం. ఎండాకాలంలో తాగడానికి ఇది అనువైన పానీయం. దీనిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
 

fruit salad

 ఫ్రూట్ ప్లేట్

ఈ పోషకమైన సలాడ్లలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి రక్షింస్తుంది. అలాగే మిమ్మల్ని శక్తివంతం చేయడానికి సహాయపడతాయి. వేసవి పొడవునా సీజన్ లో ఉండే పుచ్చకాయ, మామిడి, పైనాపిల్, బెర్రీస్ వంటి పండ్లను ఫ్రూట్ సలాడ్ తయారీకి ఉపయోగించొచ్చు.
 

ఆమ్ పన్నా

ఇది పుదీనా, సుగంధ ద్రవ్యాలు, పచ్చి మామిడి లేదా కైరీతో తయారు చేయబడిన సాంప్రదాయ పానీయం. శీతలీకరణ, పునరుజ్జీవింపజేసే పానీయంగా మాత్రమే కాకుండా ఇది విటమిన్లకు అద్భుతమైన మూలం. పచ్చి మామిడి కాయలను ఉడికించి నీరు, పుదీనా ఆకులు, చక్కెర, జీలకర్ర, ఉప్పు, ఇతర మసాలా దినుసులతో కలిపి ఆమ్ పన్నాను తయారు చేస్తారు. ఇది కూడా మన స్టామినాను పెంచుతుంది.

Latest Videos

click me!