నానబెట్టిన వాల్ నట్స్ ను రోజూ తింటే.. ఆ సమస్యలన్నీ మాయం..!

First Published | Apr 28, 2023, 1:32 PM IST

రోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తింటే ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. అలాగే పోషకాల లోపం కూడా పోతుంది. మీకు తెలుసా.. వాల్ నట్స్ బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. 
 

walnuts

వాల్ నట్స్ పోషకాల బాంఢాగారం. వీటిలో ఫైబర్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ గుప్పెడు వాల్ నట్స్ తీసుకోవడం వల్ల మీ ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి. ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. అయితే వాల్ నట్స్ ను అలాగే కాకుండా నానబెట్టి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Image: Getty Images

ఒక కప్పు నీటిని తీసుకుని అందులో 2-4 వాల్ నట్స్ ను వేసి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం బాగా నానిన వాల్ నట్స్ తినండి. నానబెట్టిన వాల్ నట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. వాల్ నట్స్ నానబెట్టేటప్పుడు మీ శరీరం పోషకాలను మరింత సులభంగా గ్రహిస్తుంది.


వాల్ నట్స్ లో మెలటోనిన్ అనే రసాయనం కూడా ఉంటుంది. అందుకే వీటిని తింటే మీరు రాత్రిళ్లు హాయిగా నిద్రపోతారు. నానబెట్టిన వాల్ నట్స్ ను ఉదయం పూటే కాదు రాత్రి పడుకునే ముందు కూడా తినొచ్చు. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
 

వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన, బలమైన రోగనిరోధక శక్తి ఉంటే వైరల్ జ్వరం, జలుబు, ఇతర ఎన్నో వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 
 

వాల్ నట్స్ లో ఇతర గింజల కంటే ఇంకా ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ల వనరులలో విటమిన్ ఇ, మెలటోనిన్, పాలీఫెనాల్స్ అని పిలువబడే మొక్కల రసాయనాలు ఉంటాయి. ఇవి వాల్ నట్స్ స్కిన్ లో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎండాకాలంలో భయంకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షించడానికి సహాయపడతాయి.
 

వాల్ నట్స్ లో ఉండే పాలీఫెనాల్స్ మంట, ఆక్సీకరణ నష్టంతో పోరాడటానికి సహాయపడతాయి. గుండె జబ్బులు రావడానికి  అసలు కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్  పేరుకుపోవడం, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరగడం. అయితే వాల్ నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Latest Videos

click me!