కీరదోసకాయను ఇలా అస్సలు తినకూడదు.. తిన్నారో మీ పని అంతే..!

First Published | Apr 26, 2023, 3:57 PM IST

ఎండాకాలంలో కీరదోసకాయలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కీరాల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే కీరదోసకాయ ప్రయోజనాలను పొందాలంటే వీటిని కొన్నింటితో కలిపి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఎండాకాలంలో కీరదోసకాయలను ఎక్కువగా తింటుంటారు. నిజానికి ఈ కీరాలను సీజన్లతో సంబంధం లేకుండా తినాలి. కానీ ఎండాకాలం తప్ప మిగతా కాలాల్లో వీటిని తక్కువగా తినాలి. ఎందుకంటే వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో వాటర్ కంటెంట్ ఎక్కువయ్యి ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ కీరాలను ఎండాకాలంలో పుష్కలంగా తినాలి. దీనివల్ల మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అంతేకాదు ఇది మనకు ఎన్నో విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. 
 

కీరదోసకాయలు కండరాలు, నరాలకు శక్తిని ఇస్తుంది. అలాగే మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్ లోపాన్ని తొలగిస్తుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీని ప్రయోజనాలను పొందాలంటే కీరాలను కొన్నింటితో కలిపి తినకూడదు. అలా తింటే దీని ప్రయోజనాలను అసలే పొందరు. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇంతకీ కీరాలతో ఎలాంటి వాటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


కీరదోసకాయ, టమోటా 

కీరదోసకాయ, టమోటా రెండింటినీ కలిపి సలాడ్స్ లో తింటుంటారు. కానీ ఈ రెండింటిని కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిజానికి ఈ రెండూ జీర్ణమయ్యే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది, అందుకే ఈ రెండింటి కాంబినేషన్ తినడం మానుకోండి. అయితే ఈ రెండింటిని తినేటప్పుడు శరీరంలోని ఆమ్ల పిహెచ్ అసమతుల్యంగా మారుతుంది. ఇది ఉబ్బరానికి దారితీస్తుంది.
 

కీరదోసకాయ, ముల్లంగి

చాలా మంది కీరదోసకాయను, ముల్లంగిని కలిపి సలాడ్ లో తింటుంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కీరదోసకాయలో ఆస్కార్బేట్ ఉంటుంది. ఇది విటమిన్ సిని గ్రహించడానికి పని చేస్తుంది. ఇలాంటప్పుడు ముల్లంగిని తింటే ఈ ప్రక్రియకు అవరోధం కలుగుతుంది. ఇది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
 

కీరదోసకాయ, పాలు 

ఆరోగ్యకరమైన పండ్లను పాలలో కలిపి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ అన్ని రకాల పండ్లను పాలలో కలపకూడదు. వీటి కాంబినేషన్ లో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది వాంతులు లేదా విరేచనాలకు దారితీస్తుంది.

Latest Videos

click me!