మీరు థైరాయిడ్ పేషెంటా? అయితే మీరు వీటిని ఖచ్చితంగా తినండి.. ఎందుకంటే?

First Published | Apr 30, 2023, 4:28 PM IST

థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత కారణంగా కొంతమంది అకస్మత్తుగా బరువు పెరిగిపోతారు. అంతేకాదు దీనివల్ల పునరుత్పత్తి ఆరోగ్యం, జుట్టు, చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీన్ని నియంత్రణలో ఉంచాలంటే కొన్ని ఆహారాలను తప్పకుండా తినాలి. 
 

thyroid

థైరాయిడ్ గ్రంథి ఒక ముఖ్యమైన అవయవం. ఇది జీవక్రియ, ఇతర శారీరక విధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలు బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలను కలిగిస్తాయి.

ఆహారం,  థైరాయిడ్ మధ్య సంబంధం ఏంటి?

మన మొత్తం ఆరోగ్యం మనం ఏం తినాలి? ఏం తినకూడదు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం తినే ఫుడ్ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే మీకు ఇప్పటికే డయాబెటిస్, అధిక రక్తపోటు, పీసీఓఎస్ వంటి వ్యాధులు ఉన్నట్టైతే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ఈ సమస్యలను మరింత పెంచుతాయి. నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలు థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్లను నియంత్రిస్తాయి. అవేంటంటే.. 

Latest Videos


సీఫుడ్

చేపలు, సెల్ ఫిష్ వంటి సీఫుడ్ అయోడిన్ కు అద్భుతమైన మూలం. ఇది థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేందుకు అవసరమైనన ఖనిజం. సెల్ ఫిష్ అయోడిన్ కు సహజ గొప్ప మూలం. అయోడిన్ థైరాయిడ్ గ్రంథిలో కేంద్రీకృతమై ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి నేరుగా ఉపయోగించబడుతుంది. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బుతుంది. దీనిని గోయిటర్ అని పిలుస్తారు.
 

nuts

గింజలు, విత్తనాలు

బ్రెజిల్ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి గింజలు, విత్తనాలలో థైరాయిడ్ ఆరోగ్యానికి అవసరమైన సెలీనియం పుష్కలంగా ఉంటుంది. సెలీనియం కోసం మీ ఆహారంలో బ్రెజిల్ గింజలు, హాజెల్ నట్స్ చేర్చొచ్చు. ఇవి థైరాయిడ్ పనితీరును  ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image: Getty Images

తృణధాన్యాలు

బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాల్లో ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయ. ఇవి థైరాయిడ్ పనితీరుకు సహాయపడతాయి. జీవక్రియను పెంచడానికి, థైరాయిడ్ గ్రంథికి సహాయపడటానికి ఓట్స్, బ్రౌన్ రైస్, మొలకలు, మొలకెత్తిన ధాన్యం రొట్టె, క్వినోవాను తినండి. 
 

ఆకుకూరలు

బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి.
 

Quinoa Upma

క్వినోవా

క్వినోవాలో గ్లూటెన్ అసలే ఉండదు. దీనిలో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరుకు ఎంతగానో సహాయపడుతుంది. 
 

Pulses

పప్పుధాన్యాలు

నిపుణుల ప్రకారం.. పప్పుధాన్యాలు ప్రోటీన్ కు, ఫైబర్ కు అద్భుతమైన మూలం. పప్పు ధాన్యాల్లో ఇనుము కూడా ఉంటుంది. ఇది థైరాయిడ్ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. 
 

గుడ్లు

గుడ్లు అయోడిన్, ప్రోటీన్ కు మంచి మూలం. ఈ రెండూ థైరాయిడ్ ఆరోగ్యానికి ముఖ్యమైనవి. వాటిలో సెలీనియం, విటమిన్ డి, థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడే ఇతర పోషకాలు కూడా ఉంటాయి.

చిలగడదుంప

చిలగడదుంపలు విటమిన్ ఎ, విటమిన్ సి కి గొప్ప మూలం. ఈ రెండూ థైరాయిడ్ ఆరోగ్యానికి ముఖ్యమైనవి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. 

click me!