వీటిని తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది..

First Published | Apr 23, 2023, 2:43 PM IST

ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు క్యాన్సర్ ను ప్రభావితం చేసే కారకాలు. అయితే మనం తినే ఏ ఫుడ్ అయినా సరే క్యాన్సర్ ను నిరోధించినప్పటికీ.. కొన్ని ఆహారాలు ఆ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తాయి. 

cancer

ముందుగానే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను నివారించొచ్చు. వాటి నుంచి బయటపడొచ్చు. అయినప్పటికీ చాలా రకాల క్యాన్సర్లను మొదటిదశలో గుర్తించలేం. ఎందుకంటే అవి ఎలాంటి లక్షణాలను చూపించవు. మీకు తెలసా? మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు క్యాన్సర్ ను ప్రభావితం చేస్తాయి. అయితే ఏ ఒక్క ఆహారం నేరుగా క్యాన్సర్ ను నిరోధించనప్పటికీ.. ఆహారంలోని కొన్ని భాగాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాలు కొన్ని ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని చూపించాయి. అవేంటంటే.. 

Image: Getty Images

పసుపు

పసుపులో ఎన్నో దివ్య ఔషదగుణాలు ఉంటాయి. పసుపు మంటను, నొప్పిని, జ్వరాన్ని, దగ్గును, జలుబును తగ్గించడం నుంచి ఎన్నో సమస్యలను ఇట్టే నయం చేస్తుంది.  పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి.
 


garlic

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది. అందుకే ఇవి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అల్లం మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 

tomatoes

టమాటాలు

క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి టమోటాలు సహాయపడతాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. టమోటాల్లో ఉండే లైకోపీన్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 
 

मटर

బీన్స్

బీన్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  బీన్స్ ను తింటే కూడా క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బీన్స్ బరువు తగ్గేందుకు, శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో సహాయపడుతుంది. 
 

Image: Getty

క్యారెట్లు

క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. క్యాన్యర్ నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. 
 

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు, బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు క్యాన్సర్ ను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడతాయి.

వాల్ నట్స్

వాల్ నట్స్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాల్ నట్స్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైటోస్టెరాల్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బయోయాక్టివ్ కారకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.

Latest Videos

click me!