కొలెస్ట్రాల్ కరగాలన్నా.. గుండె జబ్బులు రావొద్దన్నా.. ఈ తృణధాన్యాలను తప్పక తినండి

First Published | Apr 23, 2023, 12:17 PM IST

తృణధాన్యాల ఆహారాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బుల ముప్పు కూడా తప్పుతుంది. 
 

ఎండాకాలంలో మండుతున్న ఎండల వల్ల ఒంట్లో వేడి బాగా పెరిగిపోతుంది. ఈ సీజన్ లో మన శరీరం చల్లగా ఉండాలంటే మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అయితే తృణధాన్యాలను మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం తగ్గుతుంది. తృణధాన్యాలు పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం..ఇందుకు ఏయే తృణధాన్యాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఓట్స్ 

ఓట్స్ లో డైటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిలో కరిగే, కరగని ఫైబర్లు రెండూ పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ లో ఉండే కరిగే ఫైబర్ భాగాలలో ఒకటి బీటా-గ్లూకాన్స్. ఇవి ఓట్స్ లో కొలెస్ట్రాల్ ను తగ్గించే ప్రధాన భాగం. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని నిరూపించబడింది కూడా. ఓట్స్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను చాలావరకు తగ్గిస్తుంది.
 


Image: Getty

అమరాంత్

అమరాంత్ ధాన్యంలో టోకోట్రియానాల్స్, స్క్వాలేన్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ బయోసింథసిస్ ను ప్రభావితం చేస్తాయి. వీటిని తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది. 

జొన్నలు

జొన్నల్లోని ఫైటోకెమికల్స్, ఫినాల్స్, టానిన్లు,  మొక్కల స్టెరాల్స్ గుణాలు హైపో కొలెస్టెరోలెమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ బి, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, ఫలకం ఏర్పడటాన్ని నివారించడానికి, రక్త ప్రవాహం , రక్త ప్రసరణను మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. 
 

బార్లీ

బార్లీలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బార్లీ ప్లాస్మా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బార్లీలో థియామిన్, నియాసిన్, కాపర్, మెగ్నీషియం వంటి  పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడతాయి.
 

చిరుధాన్యాలలో కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి  శరీరాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే  శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శుద్ధి చేసిన ధాన్యాలకు బదులుగా పైన చెప్పిన ధాన్యాలను తినండి. మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

Latest Videos

click me!