స్ట్రాబెర్రీలతో ఇన్ని లాభాలా?

First Published | Apr 21, 2023, 12:55 PM IST

స్ట్రాబెర్రీలు టేస్టీగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండటం నుంచి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం వరకు ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. 

స్ట్రాబెర్రీలను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. ఈ తీయని పండు మనకు ఎన్నో విధాలా మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలలో రంగురంగుల వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవి రక్షణాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

Strawberries

స్ట్రాబెర్రీలు తింటే మన గ్లూకోజ్ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అలాగే ఇన్సులిన్ వాడకాన్ని పరిమితం చేస్తుంది. స్ట్రాబెర్రీలలో పాలీఫెనాల్స్ అని పిలువబడే మొక్కల సమ్మేళనాలు కూడా ఉంటాయి. అవి ఎలాజిక్ ఆమ్లం, ఎలాగిటానిన్లు.


స్ట్రాబెర్రీలు కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రక్షణాత్మక ప్రభావం ఎలాజిక్ ఆమ్లం, ఎల్లాగిటానిన్లతో సహా పాలీఫెనాల్స్ కలయికగా భావిస్తారు. ఇవి జంతు అధ్యయనాలలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

స్ట్రాబెర్రీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను (జిఐ) కలిగి ఉంటాయి. కాబట్టి  వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మితమైన మొత్తంలో విడుదల చేయడానికి సహాయపడుతుంది. తక్కువ జీఐ ఆహారాలు బరువును నియంత్రించడానికి, ఊబకాయం సంబంధిత వ్యాధులను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

ఊబకాయం తగ్గాలనుకునే వారు ఫైబర్ పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలను కూడా డైట్ లో చేర్చుకోవచ్చు. ఇవి శరీరంలోని అవాంఛిత కొవ్వును తగ్గించడానికి కూడా సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్ట్రాబెర్రీలను సలాడ్, జ్యూస్, స్మూతీగా ఆహారంలో చేర్చుకోవచ్చు.

స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. స్ట్రాబెర్రీల్లో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా అవసరం. ఈ విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎన్నో వ్యాధుల ప్రమాదాల్ని తగ్గిస్తుంది. 

Latest Videos

click me!