Dal Side Effects: రోజూ భోజనంలో పప్పు తింటే మంచిదే.. కాని..

Published : Feb 14, 2025, 05:21 PM IST

Dal Side Effects: చాలా మంది భోజనంలో పప్పు తినడానికి ఇష్టపడతారు. శాఖాహారులైతే ప్రతి రోజు ఏదో రకమైన పప్పు భోజనంలో తింటారు. దీని ద్వారా ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. కాని కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.   

PREV
15
Dal Side Effects: రోజూ భోజనంలో పప్పు తింటే మంచిదే.. కాని..

మీకు తెలుసా? మనం రోజూ ఏదో రూపంలో రకరకాల పప్పులు తింటుంటాం. కందిపప్పు, పెసర పప్పు, శనగపప్పు, మినపప్పు, వేరుశనగ పప్పు ఇలా ఏదో వంటకంలో వీటిని ఉపయోగిస్తుంటారు. వీటి ద్వారా శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు అందుతుంటాయి. ముఖ్యంగా శాకాహారులకు ఇది ప్రోటీన్‌ ను అందించేవి పప్పులే. కానీ ప్రతిదీ మితంగా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అనారోగ్యం తప్పదు. 
 

25

భోజనంలో పప్పు తింటే లాభాలు 

పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మాంసాన్ని తినని వారికి మంచి ప్రోటీన్ వనరుగా ఉపయోగపడుతుంది. ఇది మోకాళ్లు, కండరాలకు బలాన్ని ఇచ్చి శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. 

పప్పులో ఫైబర్ అధికంగా ఉండడంతో ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధక సమస్యలు తగ్గుతుంది.

పప్పులో కొలెస్ట్రాల్ ఉండదు. అందుకే ఇది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. పప్పుల్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

35

పప్పు తినడం వల్ల కలిగే నష్టాలు 

1. గ్యాస్, కడుపు ఉబ్బరం
పప్పులో ఫైబర్ అధికంగా ఉండటంతో కొంతమందికి కడుపులో గ్యాస్ సమస్యలు, ఉబ్బరం అనిపించవచ్చు. ఎక్కువగా తింటే జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చు.

2. కిడ్నీ సమస్యలు 
ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీపై ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు భోజనంలో పప్పును తక్కువగా తీసుకోవడం మంచిది.
 

45

3. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగవచ్చు
అధికంగా పప్పు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. ఇది నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులకు కారణమవుతుంది.

4. క్యాల్షియం అబ్సార్ప్షన్ తగ్గిపోవచ్చు
పప్పులో ఉండే ఫైటేట్ అనే పదార్థం శరీరంలో క్యాల్షియం అబ్సార్ప్షన్‌ను తగ్గించవచ్చు. దీని వల్ల ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది.

55

5. అధిక ఉప్పు, నూనె వేసి వండితే హానికరం
పప్పు వండే విధానం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ ఉప్పు, నూనె, మసాలాలు వేసి వండితే ఆరోగ్యపరంగా నష్టం కలుగవచ్చు. అందుకే భోజనంలో పప్పును ఎక్కువగా తినకూడదు. సరిపడా మాత్రమే తినాలి.  ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం మాత్రమే పప్పును తినడం మంచిది. రాత్రివేళ తింటే అరుగుదల సమస్యలు రావచ్చు. 

click me!

Recommended Stories