ఎంత రుచిగా ఉన్నా... ఆ సమయంలో బొప్పాయి ప్రమాదమే..!

First Published | Apr 26, 2021, 1:09 PM IST

ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారు  బొప్పాయి పండ్లను తినకూడదు. బదులుగా.. బొప్పాయి లక్షణాలు ఉండే ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఉత్తమం.

ఈ ఎండాకాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే.. పండ్లు తినడం చాలా అవసరం. అలా తినాల్సిన పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం. మార్కెట్లో సైతం ఈ బొప్పాయి.. అన్ని సీజన్లలో దొరుకుతుంది. రుచికి రుచితోపాటు.. ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ బొప్పాయిని కొన్ని సమయాల్లో మాత్రం అస్సలు తినకూడదట. అదేంటో ఇప్పుడు చూద్దాం..
బొప్పాయిలో పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వును నియంత్రిస్తుంది. ఈ ప్రక్రియ ప్రాసెస్ చేసిన మాంసంలా పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారు బొప్పాయి పండ్లను తినకూడదు. బదులుగా.. బొప్పాయి లక్షణాలు ఉండే ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఉత్తమం.

గర్భదారణ సమయంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి హానికరం. కేవలం బొప్పాయి తీసుకోవడం మాత్రమే కాదు.. అది ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు.
బొప్పాయి లో ఉండే కొన్ని రకాల పదార్థాలు.. కడుపులోని బిడ్డకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. కడుపులో బిడ్డ లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఎక్కువ మొత్తంలో బొప్పాయి తీసుకోకూడదు.
డయాబెటిక్బొప్పాయి రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇప్పటికే రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారు దీనిని తినకూడదు.
థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా హైపో థైరాయిడిజంతో బాధపడేవారు కూడా బొప్పాయి తినకూడదు. బొప్పాయిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత దిగజారిపోయి ప్రమాదం ఉంది.
ఏదైనా అలర్జీలు ఉన్నవారు కూడా బొప్పాయి లాంటివి తినకుండా ఉండటం మంచిది.
రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. శస్త్రచికిత్స సమయంలో లేదా తరువాత బొప్పాయి తినడం రక్తంలో చక్కెరపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
శస్త్రచికిత్స తర్వాత బొప్పాయి తినడం వల్ల కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి శస్త్రచికిత్స సమయంలో లేదా తరువాత బొప్పాయి తినకూడదు.

Latest Videos

click me!