స్కూల్ రోజుల్లో తిన్న ఫుడ్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది కదా. నటి సమంతకు కూడా పెరుగు గారెలతో అలాంటి తీపి గుర్తే ఉంది. రీసెంట్గా ఆమె ఓ కుకింగ్ షోలో పాల్గొన్నారు. దాంట్లో తాను తిన్న పెరుగు గారెలను గుర్తుచేసుకుని ఆమె ఎమోషనల్ అయ్యారు.
మెత్తటి మినప గారెలు, అందులో నానిన కమ్మటి పెరుగు, పైన చల్లిన కారం, కమ్మని తాలింపు చూస్తేనే నోరూరిపోతుంది. హోటల్ రుచితో ఇంట్లోనే దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
పొట్టులేని మినప్పప్పు - 1 కప్పు
ఉప్పు - తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
గట్టి పెరుగు (పుల్లగా ఉండకూడదు) - 2 కప్పులు
తాలింపు కోసం:
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
మినప్పప్పు - 1/2 టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
ఇంగువ - చిటికెడు
జీడిపప్పు - 5 నుంచి 6 (ఇష్టమైతే)
27
మినప్పప్పు నానబెట్టుకోవాలి
ముందుగా మినప్పప్పును శుభ్రంగా కడిగి, 4 నుంచి 5 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లన్నీ వంపేసి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు. గట్టిగా, ప్లఫ్ఫీగా ఉంటేనే గారెలు మెత్తగా వస్తాయి. రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు కలపాలి.
37
గారెలు వేయించుకోవాలి
కడాయిలో నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయాలి. చేతిని కొద్దిగా నీళ్లతో తడుపుకుని, పిండిని తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంట మీదే వేయించాలి. మంట పెంచితే పైన రంగు మారుతుంది కానీ లోపల ఉడకదు.
పెరుగు గారెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే అసలైన సీక్రెట్. ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకుని, నీళ్లు కలిపి మజ్జిగలా చేసుకోవాలి. వేయించిన గారెలను అందులో సుమారు 2 నిమిషాలు నానబెట్టాలి.
ఆ తర్వాత ఒక్కో గారెను విరిగిపోకుండా నెమ్మదిగా నొక్కి, అదనపు నీటిని తీసేయాలి. ఇలా చేయడం వల్ల గారెలు మెత్తబడి, పెరుగును బాగా పీల్చుకుంటాయి.
ఇష్టమైతే కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్రను కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బి మజ్జిగలో కలుపుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్.
57
కమ్మటి పెరుగు ఉండాల్సిందే
మరొక గిన్నెలో గట్టి పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా చిలకాలి. అందులో తగినంత ఉప్పు కలపాలి. బాగా పులిసిన పెరుగును అస్సలు వాడొద్దు. అలా వాడితే పెరుగు గారెల రుచి పూర్తిగా మారిపోతుంది.
67
తాలింపు ఎలా వేయాలి?
చిన్న కడాయిలో నూనె వేడి చేయాలి. ముందుగా ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఇష్టమైతే జీడిపప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. చివరగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపును పెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. ఆవాలు, కరివేపాకు సువాసన పెరుగు గారెలకు అదనపు రుచిని ఇస్తుంది.
77
పెరుగు గారెలు సర్వింగ్
క వెడల్పాటి గిన్నెలో నానబెట్టిన గారెలను పేర్చాలి. వాటి మీద పెరుగు మిశ్రమాన్ని నిండుగా పోయాలి. గారెలు పెరుగులో పూర్తిగా మునిగేలా చూసుకోవాలి. సర్వ్ చేసే ముందు తురిమిన క్యారెట్, కొత్తిమీర, కారాబూందీ చల్లితే రుచితో పాటు చూడటానికి కూడా భలేగా ఉంటాయి.
సమంతకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసిన ఈ పెరుగు గారెలను, మీరు కూడా ఇంట్లో చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇది సాయంత్రం పూట స్నాక్గానే కాకుండా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కూడా బెస్ట్ ఆప్షన్.