Daily Salt Intake రోజుకి ఇంతే ఉప్పు.. లేదంటే భారీ ముప్పు!

Published : Feb 19, 2025, 10:20 AM IST

ఉప్పు లేకుంటే మన నోట్లోకి ముద్ద దిగదు. రుచికరమైన ఆహారానికి ఉప్పు అత్యవసర పదార్థం.  కానీ అది మితిమీరితే ప్రమాదమే. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చేసిన పరిశోధనలో ఒక వ్యక్తి రోజుకి ఎంత ఉప్పు తినాలో, ఎక్కువ తింటే కలిగే దుష్ప్రభావాల గురించి తెలిపారు. రోజుకి ఎంత ఉప్పు తినాలో ఇప్పుడు చూద్దాం...

PREV
13
Daily Salt Intake రోజుకి ఇంతే ఉప్పు.. లేదంటే భారీ ముప్పు!
ఇంతే తినాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా.. పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం ఒక మనిషి రోజుకి 5 గ్రాములను మించి ఉప్పు తినకూడదు. మోతాదు మించితే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

23
ఆంధ్రప్రదేశ్, హర్యానా లో ఎక్కువ

పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా.. అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రజలు ఉప్పును అత్యధికంగా వినియోగిస్తున్నారు. దానికి తగ్గట్టే అక్కడి జనం దీర్ఘ కాలిక సమస్యలతో బాధ పడుతున్నారు.

33
ఉప్పు, సోడియం రెండూ వేరు వేరు

ఉప్పు, సోడియం ఒకటేనని జనాలు నమ్ముతుంటారు. నిజానికి ఇవి రెండూ వేర్వేరు. ఎక్కువ సోడియం బీపీని పెంచుతుంది. ఉప్పు తగ్గిస్తే ముప్పు తగ్గుతుంది. ఉప్పు అధిక వాడకంతో బీపీ పెరుగుతుంది. హై బీపీ వల్ల చర్మం ముడుతలు పడతాయికిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

click me!

Recommended Stories