mutton curry
చాలా మటుకు మేక మాంసాన్నే ఎక్కువగా తింటుంటారు. అప్పుడప్పుడు మాత్రమే గొర్రె మాంసాన్ని తింటుంటారు. అయితే 100 గ్రాముల గొర్రె మాంసంలో 300 కేలరీలు ఉంటాయి. అలాగే 20 గ్రాముల కొవ్వు, 25 గ్రాముల ప్రోటీన్, 100 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అదే మేక మాంసంలో 100 గ్రాములకు 130 కేలరీలు మాత్రమే ఉంటాయి.
అంటే గొర్రెలతో పోలిస్తే మేక మాంసంలో 35 శాతం కేలరీలు మాత్రమే ఉంటాయి. మేక మాంసంలో 2-3 గ్రాముల కొవ్వు, 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే గొర్రె మాంసం కంటే మేక మాంసమే మంచి పోషకమైందని అంటారు. అయితే మీరు ఈ రెండు మాంసాల్లో ఇనుము, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి 12 లు సమానంగా ఉంటాయి. కానీ కేలరీల్లో మాత్రం పెద్ద తేడా ఉంటుంది.
మటన్ మన శరీరానికి మంచిదేనా?
మటన్ మన శరీరానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా అని తెలుసుకోవడానికి మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి మటన్ ను ఎలా వండుతున్నాం, రెండు వారంలో ఎన్ని సార్లు మటన్ ను తింటున్నా? మూడు మటన్ తో ఇతర ఏయే ఆహారాలను తింటున్ నా?
మటన్ ను ఎలా వండాలి?
మటన్ ను తినడం వల్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం మటన్ ను ఎక్కువ నూనెతో వేయించకూడదు. మీరు గనుక ఎక్కువ నూనెలో వేయించి, పెద్ద మంటపై ఉడికిస్తే గనుక వాటిలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు, ఇతర పోషకాలు చాలా వరకు తగ్గుతాయి. మటన్ ను ఎప్పుడైనా సరే తక్కువ నూనెలో వేయించాలి. అలాగే మటన్ గ్రిల్, ఉడికించిన మటన్, మటన్ సూప్ లో పోషకాలు అస్సలు తగ్గవు.
వారానికి ఎన్ని సార్లు మటన్ ను తినాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రెడ్ మీట్ ను తక్కువగా తినడమే మంచిది. అయితే మీ శరీరంలో కేలరీల లోపం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం వారానికి రెండు సార్లు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మటన్ తో ఏయే ఆహారాలను తినాలి?
మటన్ ను ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలతో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా రకాల పండ్లు, కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పురుషులు రోజుకు 40 గ్రాములు, మహిళలకు 30 గ్రాముల ఫైబర్ అవసరమవుతుంది. అయితే ఈ ఫైబర్ కంటెంట్ మటన్ ను తినడం వల్ల సమస్యలు రాకుండా కాపాడుతుంది.
মাংস
మటన్ కొలెస్ట్రాల్ ను పెంచుతుందా?
గొర్రె, మేకల్లో కొలెస్ట్రాల్ లెవెల్ 100 గ్రాములకు 100 మి.గ్రా మాత్రమే. కానీ దీనిలో కొవ్వు 20 గ్రాములు ఉంటుంది. కొవ్వు తక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. నూనె లేకుండా మాంసాన్ని వండి తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. ఆలుగడ్డలు, కాలీఫ్లవర్, క్యారెట్లను మటన్ తో ఉడికించి తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత కీరదోసకాయ, ఉల్లిపాయ కూడా తినాలి. ఇవన్నీ కలిసి జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుంది. దీంతో శక్తి బాగా ఖర్చవుతుంది.