Weight loss: వెజ్ లోనూ హై ప్రోటీన్ ఫుడ్స్.. ఇవి కూడా బరువు తగ్గిస్తాయి..!

First Published | Dec 17, 2021, 1:10 PM IST

సోయాబీన్స్... అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉండే ఆహారంలో సోయా బీన్స్ కూడా ఉంటుంది. ఈ సోయా బీన్స్  తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  బరువు కూడా సులభంగా తగ్గే అవకాశం ఉంటుంది.

weight loss

హై ప్రోటీన్ ఫుడ్ ఏది అనగానే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కోడిగుడ్డు, చికెన్. అయితే.. మనం అనుకున్నట్లు.. కేవలం నాన్ వెజ్ లో మాత్రమే ప్రోటీన్స్ ఉన్నాయి అనుకుంటే పొరపాటే అని నిపుణులు చెబుతున్నారు. వెజిటేరియన్ ఫుడ్ లోనూ... హై ప్రోటీన్స్ ఉంటాయట. ఇవి తీసుకోవడం వల్ల కూడా.. సులభంగా బరువు తగ్గవచ్చట. మరి ఆ హై ప్రోటీన్ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..

weight loss diet

మీరు పూర్తిగా వెజిటేరియన్ అయ్యి ఉండి.. బరువు తగ్గాలి అనుకుంటే.. ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలట. మామూలుగా అయితే.. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలట. 


చియా సీడ్స్.. ఈ మధ్య కాలంలో ఈ చియా సీడ్స్ కి బాగా పాపులారిటీ వచ్చింది. ఈ చియా సీడ్స్ ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల .. సులభంగా బరువు తగ్గవచ్చట. అంతేకాకుండా.. చర్మ సౌందర్యానికీ.. జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి.  ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ ఆహారం.. తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

సోయాబీన్స్... అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉండే ఆహారంలో సోయా బీన్స్ కూడా ఉంటుంది. ఈ సోయా బీన్స్  తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  బరువు కూడా సులభంగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఇక ఈ రోజుల్లో చాలా మంది మామూలు బియ్యం  కి బదులు.. కినోవా వాడటం మొదలుపెడుతున్నారు. నిజానికి.. కినోవా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో.. ఫైబర్ తో పాటు.. ప్రోటీన్ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఫ్యాట్ తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది.

పాలకూర.. ఆకుకూరలు అన్నింటిలో..పాలకూర ది బెస్ట్ అని చెప్పొచ్చు. పాల కూరను సూప్, కూర లేదా.. సాండ్ విచ్ రూపంలో తీసుకోవచ్చు. పాలకూర లో ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.  దీనిని తీసుకోవడం వల్ల.. .. జుట్టు, చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. అంతేకాకుండా.. బరువు  తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది.
 

బీన్స్...  బీన్స్ లో కూడా.. ప్రోటీన్ చాలా రిచ్ గా ఉంటుంది.. బీన్స్ తీసుకోవడం వల్ల మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల.. గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అంతేకాదు.. బ్రెయిన్ పనితీరు కూడా సహాయం చేస్తుంది. ఇవి తినడం వల్ల.. తొందరగా ఆకలి తీరుతుంది. కాబట్టి.. ప్రతిరోజూ దీనిని తీసుకోవచ్చు.

బాదంపప్పు.. నట్స్ అన్నింటిలోనూ బాదం పప్పు ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. పావు కప్పు బాదం పప్పులో.. మనిషికి కావాల్సిన ప్రోటీన్స్ అన్ని ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది.

Latest Videos

click me!