మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఏం తినకూడదు?

First Published | Jul 31, 2024, 10:42 AM IST

ప్రస్తుత కాలంలో 30 ఏండ్లకే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ మోకాళ్ల నొప్పులు ఒక్కసారి వచ్చాయంటే.. ఇక జీవితాంతం ఉంటాయి. ఈ నొప్పులను శాశ్వతంగా తగ్గించుకోవడం సాధ్యం కాదు. కానీ నొప్పి పెరగకుండా మాత్రం జాగ్రత్త పడొచ్చు. ఎలాగంటే? 
 

ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు వచ్చేవి. ఇప్పుడు 30 ఏండ్ల వారు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వృద్ధాప్యం, గాయాలు, మంట, ఆహారపు అలవాట్లు,  జీవనశైలి వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మోకాళ్ల నొప్పుల వల్ల వండగానికి, నడవడానికి, ఏదైనా పనిచేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు మోకాళ్ల నొప్పులను మరింత పెంచుతాయి. అందుకే మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఏయే ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

చక్కెర

చక్కెరతో చేసిన ఆహారాలు టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ ఈ చక్కెర ఆహారాలు సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీంతో శరీరంలో మంట పెరుగుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు షుగర్ ఫుడ్స్ ను తినకూడదు. 
 


ఉప్పు

కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా వరకు తగ్గించాలి. రోజువారి ఆహారంలో కూడా ఉప్పును చాలా వరకు తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల  రక్తపోటు పెరుగుతుంది. శరీరంలో నీరు నిలుపుదల వంటి సమస్యలు వస్తాయి. ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. కాళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. అందుకే మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఉప్పును ఎక్కువగా తినకూడదు.

వేయించిన ఆహారాలు

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అని పిలువబడే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులకు దారితీస్తాయి. 

Image: Getty Images

పాల ఉత్పత్తులు

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా నెయ్యి, పనీర్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులను తినకుండా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శరీరంలో మంటను పెంచుతాయి. 

ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు

ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే వీటిని తినడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. కాబట్టి ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఉన్న వేరుశెనగ నూనె, గుడ్లు వంటి ఆహారాలను తినకండి. 

మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఏం తినాలి?

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి కొన్ని రకాల ఆహారాలు మంచి మేలు చేస్తాయి. చెర్రీలు, ఆలివ్ ఆయిల్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, ఆకుకూరలు, అల్లం, వెల్లుల్లిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 
 

Latest Videos

click me!