జీర్ణక్రియకు మంచిది
నెయ్యి, చపాతీ కాంబినేషన్ మీ బరువును తగ్గించడంతో పాటుగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణసమస్యలను తగ్గించడానికి కూడా ఇది ప్రయోజకరంగా ఉంటుంది.ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని మీరు నెయ్యిని ఎంత పడితే అంత తీసుకోకూడదు. దీని ప్రయోజనాలను పొందాలంటే మాత్రం నెయ్యిని మోతాదులోనే తీసుకోవాలి. అతిగా తిన్నారంటే సమస్యల బారిన పడాల్సి వస్తుంది.