బరువు తగ్గడానికి పచ్చిమిర్చి సహాయపడుతుందా? నిజమేంటంటే?

First Published | Jul 30, 2024, 4:07 PM IST

బరువు తగ్గాలనుకునే వారు ఎన్నో పద్దతులను పాటిస్తుంటారు. కానీ చాలా మంది బరువు తగ్గడానికి పచ్చిమిర్చి బెస్ట్ ఫుడ్ అని అంటుంటారు. అసలు పచ్చిమిరపకాయలు బరువు తగ్గడానికి సహాయపడతాయా? లేదా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బరువు తగ్గడానికి ఇది చేయాలి, అది చేయాలి, అని ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తుంటారు. కొంతమంది ఇవి తింటే బరువు తగ్గుతారని చెప్తే.. మరికొంతమంది బరువు తగ్గాలంటే ఇవి తినకూడదు అని చెప్తుంటారు. అయితే కొంతమంది బరువు తగ్గడానికి పచ్చిమిర్చి కూడా సహాయపడుతుందని అంటుంటారు. అసలు పచ్చిమిర్చి మన బరువును తగ్గిస్తుందా? లేదా? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పోషకాలు

పచ్చిమిర్చిలో విటమిన్ ఎ, విటమిన్ సి, డైటరీ ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిర్చిని తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. పచ్చిమిర్చీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఊపిరితిత్తులు, కళ్లు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు లేదా బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్న వారికి పచ్చిమిర్చి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

Latest Videos



బరువు తగ్గడానికి పచ్చిమిర్చి ప్రయోజనకరంగా ఉంటుందా?

పచ్చిమిర్చి తినడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే క్యాప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన శరీర వేడిని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పచ్చిమిర్చీలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అంటే పచ్చి మిర్చి డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుకు కనీసం 4-6 గ్రాముల పచ్చిమిర్చి తింటే సరిపోతుంది. 
 

ఇవే కాకుండా పచ్చిమిరపకాయలను తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తింటే ఎసిడిటీ, గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇవి మన  మొత్తం గట్ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే రోజుకు 8-10 కంటే ఎక్కువ పచ్చిమిరపకాయలను తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

click me!