ఇవి టీ బాంబ్స్.. సాటిలేని రుచి.. వీటి స్టైలే వేరు..!

First Published Feb 8, 2021, 11:27 AM IST

కేవలం సెకన్ల వ్యవధిలో హాట్ వాటర్ ఉంటే.. ఈ టీ బాంబ్స్ తో రుచికరమైన టీని తాగేయవచ్చు. వేడి నీరు ఉంటే.. అందులో అవి వేసుకుంటే సరిపోతుంది.

ఉదయాన్నే లేవగానే వేడి వేడిగా పొగలు కక్కే టీ తాగితే ఎంత హాయిగా ఉంటుంది. చాలా మందికి అసలు తీ తాగకుండా రోజే మొదలుకాదు.
undefined
అయితే.. ఇంట్లో ఉన్నప్పుడు మనకు నచ్చినట్లు టీ దొరుకుతుంది. మరి బయటకు ఎక్కడికైనా వెళ్లినా.. లేదా ట్రావెలింగ్ లో ఉన్నా... మనకు నచ్చిన విధంగా టీ దొరకడం కొంత కష్టమే.
undefined
లేందటే పాలు, టీ బ్యాగ్.. మరీ కాదంటే.. హాట్ వాటర్, మిల్క్ పౌడర్, షుగర్, టీ బ్యాగ్ ఇలా చాలా క్యారీ చేయాలి. అవేమీ లేకుండా.. కమ్మని టీని మీకందించే పనిని ఈ టీ బాంబ్స్ చేస్తున్నాయి.
undefined
అవును కేవలం సెకన్ల వ్యవధిలో హాట్ వాటర్ ఉంటే.. ఈ టీ బాంబ్స్ తో రుచికరమైన టీని తాగేయవచ్చు. వేడి నీరు ఉంటే.. అందులో అవి వేసుకుంటే సరిపోతుంది. వీటిలో కేవలం సాధారణ టీ మాత్రమే కాదు.. చాలా ఫ్లేవర్లు కూడా ఉన్నాయి.
undefined
చూడటానికి వివిధ రంగుల్లో పంచదార గుళికల్లా కనిపిస్తాయి ఈ టీ బాంబ్స్. హెర్బల్, అరోమెటిక్ ఫ్లవర్స్ ఇలా విభిన్న ఫ్లేవర్స్ లో ఉండే వీటిని వేడి నీటిలో వేయగానే కరగిపోయి రుచికరమైన టీ తయారౌతుంది.
undefined
ప్రస్తుతం ఈ టీ బాంబ్స్ మార్కెట్లో సులభంగా దొరకుతున్నాయి. నచ్చిన ఫ్లేవర్స్ కొనుక్కుంటే.. నచ్చినప్పుడు తయారుచేసుకొని తాగేయవచ్చు.
undefined
అయితే.. వీటిని మార్కెట్ దాకా వెళ్లి కొనడం ఎందుకు అని కొందరు నెటిజన్లు.. వీటిని ఎలా తయారు చేయాలి అని నెట్టింట వెతకడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం వీటిని తయారు చేయడం ఎలా అనే విషయం నెట్టింట ట్రెండింగ్ గా మారడం గమనార్హం.
undefined
వీటిని దాదాపు క్యారమిల్, లావెండర్, వైట్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ ఫ్లేవర్స్ లో ఎక్కువగా తయారు చేస్తున్నారు.
undefined
కొందరు ఇప్పుడు వీటితో వ్యాపారం కూడా చేసేస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా.. ప్రత్యేకంగా పేజీలు ఏర్పాటు చేసి.. అందులో వీటి అమ్మకాలు మొదలుపెట్టారు.
undefined
click me!