ఎండాకాలం పెరుగు మన శరీరానికి చాలా మంచిది. శరీరంలో వేడి తగ్గించడానికి పెరుగు చాలా సహాయం చేస్తుంది. సాధారణంగా మనం పెరుగు ఎలా తయారు చేస్తాం.. పాలు వేడి చేసి.. గోరువెచ్చని వేడిగా ఉన్న సమయంలో.. దాంట్లో కొద్దిగా పెరుగు వేస్తే.. అది కాస్త పెరుగుగా మారుతుంది. ఆ తర్వాత దానితో మనం రైతా, మజ్జిక, లస్సీ ఇలా రకరకాలు గా చేసుకొని ఆస్వాదిస్తాం.
ఒక్కోసారి తోడు వేయడానికి పెరుగు దొరకదు. అయితే.. అవి లేకుండా.. కేవలం పచ్చిమిరపకాయలతో ఇంట్లోనే పెరుగు తయారు చేసుకోవచ్చు. మరి దాని తయారీ ఇప్పుడు చూద్దాం..
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. పుల్లని పెరుగు సాధారణ దేశీయ పదార్ధంతో తయారు చేయవచ్చనేది నిజం.
ఇంట్లో పుల్లని పెరుగు చేయడానికి ఒక మిరపకాయ మరియు పాలు మాత్రమే అవసరం.
అవును, పచ్చి మిరపకాయను ఉపయోగించడం ద్వారా మీరు సులభంగా పుల్లని పెరుగును పొందవచ్చు.
ఇందుకోసం మీకు 500 మి.లీ పాలు, 2 పచ్చి మిరపకాయలు అవసరం. మొదట పాలను వేడిచేయాలి.
అప్పుడు గది ఉష్ణోగ్రతకు చల్లార్చాలి. తర్వాత ఆ పాలలో పచ్చిమిర్చి కాండాలు, 2 మిరపకాయలు కలపండి.
పచ్చి మిరపకాయలు పాలలో పూర్తిగా మునిగిపోతాయని గుర్తుంచుకోండి.
ఇప్పుడు ఈ కుండను పూర్తిగా కవర్ చేసి 10 నుండి 12 గంటలు వదిలివేయండి. అయితే, ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టొద్దు.
12 గంటల తర్వాత తీసి చూస్తే.. పెరుగు తయారై ఉంటుంది.
పచ్చి మిరపకాయలో ఉండే కొన్ని ఎంజైమ్స్ పెరుగు తయారు కావడానికి సహాయపడతాయి.