పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 7, 2024, 1:30 PM IST

పుచ్చకాయ హైడ్రేటింగ్ పండు. దీనిలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. పుచ్చకాయను ఎండాకాలంలో బాగా తింటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అయితే చాలా మంది పుచ్చకాయ ముక్కలపై ఉప్పు జల్లుకుని తింటుంటారు. ఇలా తింటే ఏమౌతుందో తెలుసా? 
 

ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మండిపోతున్న ఎండల దాహాన్ని తీర్చుకోవడానికి ఈ సీజన్ లో నీళ్లను మజ్జిగను తాగాడంతో పాటుగా పుచ్చకాయను కూడా ఎక్కువగా తింటుంటారు.  పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే శరీరంలోని నీటి లోపం తొలగిపోతుంది. దీనిలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చాలా మంది పుచ్చకాయ ముక్కలపై ఉప్పును జల్లుకుని తింటుంటారు. ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పుచ్చకాయను ఉప్పుతో తింటే ఏమౌతుందో తెలుసా? 


పోషక శోషణను పెంచుతుంది

పుచ్చకాయను ఉప్పుతో తనడం వల్ల మన శరీరం లైకోపీన్ వంటి కొన్ని పోషకాలను మరింత సులభంగా గ్రహించగలుగుతుంది. ఇది జీర్ణ ప్రక్రియలను ప్రభావితం చేయడం వల్ల పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది.

Latest Videos


ఎలక్ట్రోలైట్లు సమతుల్యం 

పుచ్చకాయ హైడ్రేటింగ్ పండు. దీనికి చిటికెడు ఉప్పును జోడించడం వల్ల ఎలక్ట్రోలైట్లను, ముఖ్యంగా సోడియంను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. అయితే వీటిని మీరు వ్యాయామం, వేడి కారణంగా కోల్పోతారు. 

తీపిని పెంచుతుంది

ఉప్పు పుచ్చకాయలోని తేలికపాటి చేదును తగ్గిస్తుంది. అలాగే ఉప్పు దీని సహజ తీపిని పెంచుతుంది. ఎందుకంటే ఉప్పు ఉండటం వల్ల తీపి మరింత పెరుగుతుంది. 
 

Watermelon

మరింత జ్యూసీగా 

ఉప్పు తీపిని పెంచడంతో పాటుగా ఈ పండు ఆకృతి కూడా మెరుగుపడుతుంది. ఉప్పు దానిలో ఉన్న మొత్తం నీటిని పండు ఉపరితలానికి తీసుకువస్తుంది. దీంతో పుచ్చకాయ ముక్కలు మరింత జ్యూసీగా మారుతాయి.

ఏ ఉప్పు మంచిది?

మీరు పుచ్చకాయను ఉప్పుతో కలిపి తినాలంటే సముద్రపు ఉప్పును ఉపయోగించండి. ఈ ఉప్పులో ఉండే లవణాలు పండు సహజ రుచిని ప్రభావితం చేయకుండా తేలికపాటి ఉప్పు రుచిని ఇస్తాయి.
 

ఎంత ఉప్పు వాడాలి? 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మీరు ఒక రోజుకు సోడియాన్ని 2,300 మిల్లీగ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి. ఉప్పును ఎక్కువగా తింటే రక్తపోటు పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

click me!