వెల్లుల్లిని వంటలో భాగం చేసుకోవడం వల్ల.. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. వెల్లుల్లి పొట్టులోనూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చాలా పోషకాలు ఉన్నాయంట.
సాధారణంగా వెల్లుల్లి తొక్కలు ప్రతి ఒక్కరి ఇళ్లలో చెత్తబుట్టలో పడిపోతాయి. కానీ వాటిలో విటమిన్లు ఎ, సి , ఇ యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అందువల్ల, నిపుణుల అభిప్రాయం ప్రకారం, వెల్లుల్లి తొక్క గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి , మొత్తం ఆరోగ్యానికి మ్యాజిక్ లాగా పనిచేస్తుంది.