బరువు తగ్గాలని లెమన్ వాటర్ తాగుతున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి..!

First Published | Jun 7, 2024, 10:06 AM IST

నిమ్మకాయ నీటిని కొందరు హాట్ వాటర్ తో, కొందరు కూల్ వాటర్ తో తాగుతూ ఉంటారు. ఈ నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మనకు తక్షణ ఎనర్జీ వస్తుంది. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  అందులో ముందుగా అందరూ మొదట చేసేది ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగడం. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని తాగితే చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు అని చాలా మంది చెబుతూ ఉంటారు. దీంతో.. అందరూ దానిని గుడ్డిగా ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇది కొంత వరకు నిజం అవ్వచ్చు. కానీ... ఆ నిమ్మనీరు తాగే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మీరు ఎన్ని లీటర్లు తాగినా బరువు తగ్గరట. మరి ఆ పొరపాట్లు ఏంటో చూద్దాం..

నిమ్మకాయ నీటిని కొందరు హాట్ వాటర్ తో, కొందరు కూల్ వాటర్ తో తాగుతూ ఉంటారు. ఈ నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మనకు తక్షణ ఎనర్జీ వస్తుంది. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది.


నిమ్మకాయ నీరు తాగడం వల్ల.. బరువు తగ్గుతాం అనే భయం ఉండదు. ఎందుకంటే... ఈ నీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం 6 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.  అయితే.. మీరు అందులో పంచదార మాత్రం కలపకూడదు. అప్పుడు మాత్రమే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతామనే భయం ఉండదు.

honey lemon water

నిమ్మకాయ నీటి రుచి పెరగాలి అంటే... అందులో ఉప్పు లేదంటే.. పంచదార ఉండాల్సిందే అని చాలా మంది అనుకుంటారు. కానీ.. ఇది చాలా పెద్ద తప్పు అంట. పొరపాటున కూడా పంచదార మాత్రమే కాదు.. ఉప్పు కూడా కలపకూడదట. వీటిని కలపడం వల్ల.. ఆ నిమ్మరసం అనారోగ్యకరంగా మారుతుందట.

అలా కాకుండా.. నిమ్మకాయ నీళ్లు.. రుచిగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం  రాత్రిపూట నీటిలో.. నిమ్మ ముక్కలు వేయాలి. దానితో పాటు తేనె, అల్లం, పుదీనా ఆకులు వేసి ఉంచాలి.  రాత్రంతా అలా ఉంచిన నీటిని.. ఉదయాన్నే తాగడం వల్ల.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి  లభిస్తుంది. అంతేకాదు.. బాడీ హైడ్రేటెడ్ గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
 


ఇక నిమ్మకాయ నీళ్లు తాగితే మంచిది అన్నారు కదా అని.. రోజంతా ఆ నీటిని తాగకూడదు. రోజూ ఒకే టైమ్ కి తాగడం అలవాటు చేసుకోవాలి. కావాలంటే.. రోజుకి రెండు సార్లు తాగొచ్చు.
 

నీళ్లల్లో నిమ్మరసం పిండుకొని కూడా తాగొచ్చు. అయితే.. మీరు లెమన్ వాటర్ తాగిన ప్రతిసారీ ఫిల్టర్ వాటర్ ఉపయోగించడమే మంచిది. అంతేకాదు.. నిమ్మరసాన్ని ఎప్పుడూ నీటిలో కలిపి మాత్రమే తీసుకోవాలి. డైరెక్ట్ గా.. నిమ్మరసం తాగకూడదు. డైరెక్ట్ గా తాగితే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ఆ పొరపాటు చేయకూడదు.

ఇక నిమ్మకాయ నీటిని రోజూ ఉదయం పూట మాత్రమే తాగడం మంచిది. మెటబాలిజం ని మెరుగుపరుస్తుంది. 
 

Latest Videos

click me!