బరువు తగ్గేందుకు రోజుకి ఎన్ని చపాతీలు తినాలి..?

First Published | Oct 12, 2020, 2:17 PM IST

మనదేశంలో ఎక్కువగా తీసుకునేది.. అన్నం  లేదంటే చపాతీలే. కాబట్టి.. ఈ రెండింటిని పూర్తిగా తినడం మానేయాలని అస్సలు అనుకోకూడదు. రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి. 

బరువు తగ్గాలి అనుకునేవాళ్లు ముందుగా చేసే పని అన్నం తినడం మానేయడం. అన్నం తినడం మానేసి.. చపాతీలు తినడం మొదలుపెడతారు. మరి నిజంగానే.. అన్నం తినడం మానేసి.. చపాతి తినడం మొదలుపెడితే.. బరువు తగ్గిపోతారా..? కొందరు సులభంగానే తగ్గుతారు.. కానీ మరి కొందరు మాత్రం బరువు తగ్గకపోగా.. అతిగా పెరుగుతూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే.. వాళ్లు ఎన్ని చపాతీలు తింటున్నారనే విషయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఎందుకంటే.. మీరు తినే చపాతి అంటే గోధుమ పిండిలో సైతం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి.. చపాతీలు ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రోజుకి ఎన్ని చపాతీలు తినాలి..? ఎన్ని తింటే బరువు తగ్గగలమో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
undefined

Latest Videos


మనదేశంలో ఎక్కువగా తీసుకునేది.. అన్నం లేదంటే చపాతీలే. కాబట్టి.. ఈ రెండింటిని పూర్తిగా తినడం మానేయాలని అస్సలు అనుకోకూడదు. రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్స్, పిండి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
undefined
ఇక బరువు తగ్గాలని అనుకునేవాళ్లు ముందుగా పిండిపదార్థాలు తీసుకోవడం మానేస్తారు. కానీ అవి కూడా శరీరానికి చాలా ముఖ్యమనే విషయం గుర్తించాలి. కనీసం రోజుకి 250 గ్రాముల పిండి పదార్థాలు అవసరమని ఒకవేళ డైటీషియన్ చెప్పి ఉంటే.. రోజుకి 4 చపాతీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో చపాతీలో 75గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి.
undefined
బరువు తగ్గాలని అనుకునేవాళ్లు.. ముందుగా డైటీషియన్ సహాయంతో.. ఎంతమేర పిండిపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుందో అడిగి తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా చపాతీలు తీసుకోవాలి.
undefined
ఆహార మార్గదర్శకాల ప్రకారం, ఆరోగ్యకరమైన వ్యక్తులు వినియోగించే కేలరీల మొత్తంలో కార్బోహైడ్రేట్లు 45 నుండి 65 షేడ్స్ మధ్య అందిస్తాయి. మీ ఆహారం సుమారు 2000 కేలరీలను అందిస్తుంటే, 225 నుండి 325 గ్రాముల కార్బోహైడ్రేట్లను పరిగణించండి. మీరు త్వరగా బరువు తగ్గాలంటే, రోజుకు 50 నుండి 150 గ్రాముల కార్బోహైడ్రేట్లను మాత్రమే తినాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.
undefined
అంతేకాదు.. మీరు అన్నం మానేసి.. రాత్రిపూట చపాతీ తినడం మొదలుపెడితే.. వాటి పరిమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనంలో మీరు 300 క్యాలరీల ఫుడ్ తీసుకుంటే.. రాత్రి సమయంలో రెండు చపాతీలు తింటే సరిపోతుంది.
undefined
ఆ రెండు చపాతీలతో మీకు 140 క్యాలరీల శక్తి వస్తుంది. మిగిలినది మీరు తీసుకునే కూరలతో లభిస్తుంది. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మీరు బరువు తగ్గగలుతుగతారు.
undefined
ఇక కేవలం చపాతీలు మాత్రమే తీసుకోకుండా.. మీ భోజనంలో పండ్లు, కూరగాయలకు కూడా చోటు ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యకరంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
undefined
ఇక వాటిని తినే సమయం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చపాతీనే కదా తినేది అని.. రాత్రి 7 తర్వాత తింటే పెద్దగా ప్రయోజనం ఉండదట. త్వరగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
undefined
చపాతీలో కార్బోహైడ్రేట్ మాత్రమే కాకుండా, ప్రోటీన్, కొవ్వు, భాస్వరం, మెగ్నీషియం, ఫోలేట్ మరియు ఇనుము కూడా ఉంటాయి. చపాతీ తినడం ద్వారా అవసరమైన అన్ని పోషకాలను మన శరీరం పొందగలుగుతుంది.
undefined
మరింత ఆరోగ్యంగా చపాతీ తీసుకోవాలని మీరు అనుకుంటే.. మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి.. లేదంటే మిల్లెట్స్ తో ఉన్న గోధుమ పిండితో తయారు చేసిన వాటిని తినొచ్చు.
undefined
click me!