foods for thyroid
మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారు. ఇది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. థైరాయిడ్ సంబంధిత వ్యాధి ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ అనేది మన మెడ దిగువ భాగంలో ఉండే గ్రంథి. ఇది శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ను నియంత్రిస్తుంది. దీని వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల హార్మోన్ల మార్పులు, ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, విపరీతంగా నిద్రపోవడం వంటి సమస్యలు వస్తాయి.
thyroid
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనిచేయడానికి అయోడిన్ చాలా అవసరం. దీని లోపం వల్ల థైరాయిడ్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో అయోడిన్ ను సరిపడా చేర్చుకోవాలి. అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
thyroid
నోరి, కెల్ప్ వంటి సముద్ర కూరగాయలు అయోడిన్ కు మంచి వనరులు. మీరు వీటిని సూప్ గా, సలాడ్ గా మీ డైలీ డైట్ లో చేర్చుకోవచ్చు. వీటిని తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్ కు సంబంధించిన సమస్యలు కూడా రావు.
చేపలు
కాడ్, ట్యూనా, సాల్మన్ వంటి చేపల్లో అయోడిన్ మెండుగా ఉంటుంది. ఈ చేపలను తింటే మీకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. అలాగే అయోడిన్ కూడా సరఫరా అవుతుంది. దీన్ని గ్రిల్ చేసి లేదా బేక్ చేసి తినొచ్చు. ఇవి తింటే మీ ఆరోగ్యంగా బేషుగ్గా ఉంటుంది.
పాల ఉత్పత్తులు
పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో కూడా అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే థైరాయిడ్ సమస్యలు రావు. అలాగే వీటిలో ఉండే కాల్షియం మీ ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుడ్లు
గుడ్లలో అయోడిన్ తో పాటుగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో సెలీనియం, జింక్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. గుడ్లను తింటే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. మీరు గుడ్లను ఉడకబెట్టి తినొచ్చు. లేదా ఆమ్లేట్ గా తినొచ్చు.