టీని ఆరోగ్యంగా మార్చుకోవడమెలా?

First Published | Sep 27, 2023, 11:15 AM IST

మీరు తాగే టీనే కొన్ని మార్పులతో ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మామూలు టీలోనే విటమిన్స్ ని పెంచుకోవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..

milk tea

ఉదయం లేవగానే చాలా మందికి  వేడి వేడిగా టీ తాగాల్సిందే. టీ తాగకపోతే చాలా మందికి తల నొప్పి వచ్చేస్తుంది. అసలు టీ పొట్టలో పడనిది ఏ పని చేయలేం అని అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే,  టీ తాగడం మంచిది కాదని, అది మన ఆయుష్షు ను తగ్గించేస్తుంది అని నమ్మేవారు కూడా ఉన్నారు. అలా అని టీ మానేయాల్సిన అవసరం లేదు. మీరు తాగే టీనే కొన్ని మార్పులతో ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మామూలు టీలోనే విటమిన్స్ ని పెంచుకోవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..

lemon tea

1. మీరు టీ తయారు చేసే సమయంలో  కొద్దిగా నిమ్మరసం  కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం కలుపుకోవడం వల్ల  విటమిన్ సి ని మీరు అందులో కలిపిన వారు అవుతారు. ఇలా నిమ్మరసం కలిపిన టీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.


Ginger Tea

2.మీరు తాగే టీలో అల్లం కలపడం అలవాటు చేసుకోండి. అల్లం టీ తాగడం వల్ల  కూడా మీరు శరీరానికి విటమిన్ సీ అందించవచ్చు.  100గ్రాముల అల్లంలో 5 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంి. కాబట్టి, అల్లం వాడటం వల్ల మీరు మీ టీ ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
 

bay leaf

3.బిర్యానీ ఆకును మనం బిర్యానీ, బగారా రైస్ చేసే సమయంలో వాడుతూ ఉంటాం. కానీ, అదే బిర్యానీ ఆకును టీ తయారు చేసే సమయంలో కూడా ఉపయోగించవచ్చట. అలా ఉపయోగించడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందట. దీని వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తాయి

4.దాల్చిన చెక్కలో విటమిన్ బి, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, టీ తయారు చేసేటప్పుడు చిన్న దాల్చిన ముక్క వేసి మరిగించడం వల్ల, ఆ విటమిన్స్ టీలో చేరి మీ శరీరానికి అందిస్తాయి

5.యాలకులను మనం స్వీట్స్ లో ఎక్కువగా వాడతాం. దాని వల్ల మంచి సువాసన చేరుతుంది. అయితే, ఇదే యాలకులను టీలో కూడా చేర్చాలట. అలా చేర్చడం వల్ల రుచి, మంచి సువాసనతో పాటు విటమిన్ సి, విటమిన్ బి కూడా మనకు లభిస్తాయి.

clove tea


6.లవంగాలను మనం మసాలా కూరల్లో, బిర్యానీల్లో ఉపయోగిస్తాం. కానీ, అవే లవంగాలను టీలో వేసి మరిగించడం వల్ల విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందట. మంచి రుచి కూడా టీకి లభిస్తుంది.

7.నల్ల మిరియాలలో విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ బి  లు పుష్కలంగా ఉంటాయి.  వీటిని వేసి టీలో మరిగించడం వల్ల ఆరోగ్యంతో పాటు రుచి కూడా పెరుగుతుంది. ఈ టీ తాగడం వల్ల జలుబు లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

8.పసపులో విటమిన్ సి, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి.   ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారట. జలుబు వంటి సమస్యల నుంచి కూడా తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది.

Latest Videos

click me!