గుడ్ల కంటే వీటిలో ప్రోటీన్ ఇంకా ఎక్కువుంటుంది తెలుసా?

First Published | Apr 26, 2023, 1:31 PM IST

గుడ్డు సంపూర్ణ ఆహారం. వీటిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక గుడ్డును తిన్నా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. పోషకాలు బరువు తగ్గడానికి, కండరాలు బలోపేతం అయ్యేందుకు, శరీరానికి శక్తిని అందించేందుకు సహాయపడతాయి. 
 

మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్లు ఎంతగానో సహాయపడతాయి. ఇవి ఎన్నో రోగాలను దూరం చేస్తాయి. పోషకాల లోపం మనల్ని ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తుంది. మితమైన మొత్తంలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. అంతేకాదు శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది. 

egg

ప్రోటీన్ అనగానే టక్కున అందరికీ గుర్తొచ్చేది గుడ్డు. ఎందుకంటే గుడ్డు పోషకాల భాండాగారం. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల గుడ్లలో 13 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కానీ గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండే ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. గుడ్లను తినని వారు వీటిని తిన్నా శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లను పొందొచ్చు. 


సోయాబీన్

సోయాబీన్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. దీనిని తింటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. 100 గ్రాముల సోయాబీన్ లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్ తినడం గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన ను పొందుతారు. 
 

పప్పుధాన్యాలు 

పప్పు ధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల ఉడికించిన పెసరపప్పులో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ పప్పును తిన్నా మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. గుడ్లకు బదులుగా పెసరపప్పును కూడా తినొచ్చు. 
 

చియా విత్తనాలు

చియా విత్తనాలు కూడా పోషకాల భాండాగారం. ఇవి దక్షిణ అమెరికా దేశాలు, మెక్సికోలో కనిపించే సిల్వియా హిస్పానికా అనే మొక్క విత్తనాలు. ఈ బేబీ సీడ్ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా ప్రోటీన్లు, ఖనిజాల భాండాగారం. ఫైబర్, క్యాల్షియం, జింక్, ఐరన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే చియా సీడ్ వాటర్ జీర్ణక్రియకు కూడా గొప్పది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఇవి కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఇవి పొట్టను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 100 గ్రాముల చియా విత్తనాలలో 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
 

Latest Videos

click me!