మొల్లకెత్తిన గింజలతో.. చిగురించే ఆరోగ్యం..

First Published | Apr 21, 2021, 4:55 PM IST

చక్కటి ఆరోగ్యం మీ సొంతం కావాలంటే అన్ని రకాల ఆహార పదార్థాలనూ తినాలి. ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలతో పాటు మొలకెత్తిన గింజలూ మీ ప్రతిరోజూ ఆహారంలో ఉండాలి. 

చక్కటి ఆరోగ్యం మీ సొంతం కావాలంటే అన్ని రకాల ఆహార పదార్థాలనూ తినాలి. ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలతో పాటు మొలకెత్తిన గింజలూ మీ ప్రతిరోజూ ఆహారంలో ఉండాలి.
అప్పుడే మొలకెత్తిన గింజలు చూడడానికి ఎంతో అందంగా, తాజాగా కనిపిస్తాయి. అంతే స్థాయిలో పోషకాలను కలిగి ఉంటాయి. మొలకలు రావాలంటే సరైన ఉష్ణోగ్రత, తేమ, చల్లటి ప్రదేశం లాంటివి ఉండాలి.

గింజల్ని నీళ్లలో నానబెట్టడంతో మొలకల ప్రక్రియ మొదలవుతుంది. గింజల్ని నిర్ణీత సమయంపాటు నీటిలో నానబెట్టినప్పుడు మొలకలు వస్తాయి. మన ఇళ్లలో ఎక్కువగా పెసర్లు నానబెట్టడం చూస్తుంటాం. వీటితో పాటు శనగలు, బీన్స్, సోయాబీన్స్, కిడ్నీ బీన్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, వోట్స్ లాంటివాటిని కూడా మొలకెత్తిన ఆహారపదార్థాలుగా మార్చొచ్చు.
ఇక కూరగాయల్లోకి వస్తే చాలామంది మొలకెత్తిన ఆకుకూరలైన మస్టర్డ్ గ్రీన్స్, మెంతికూర, ముల్లంగి, కొత్తిమీర, బ్రొక్కొలీలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
నేరుగా గింజల్ని తినడం కంటే మొలకెత్తిన గింజల్ని తినడం వల్ల వాటిలోని పోషక పదార్ధాలు పెరుగుతాయి. తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుదని పోషకాహార నిపుణుల అభిప్రాయం.
నీటిలో నానబెట్టడం వల్ల ధాన్యాల పై పొర సున్నితంగా మారుతుంది. దీనివల్ల జీర్ణక్రియ తొందరగా అవుతుంది. గ్యాస్ ను ఉత్పత్తి చేసే పిండి పదార్థాలను తొలగిస్తుంది. నానబెట్టడం వల్ల వంట చేసే సమయమూ ఆధా అవుతుంది.
మొలకెత్తిన గింజల్ని అలాగే తినొచ్చు.. లేదా ఏదైనా వంటల్లో కలిపి తినవచ్చు. వీటివల్ల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ ప్రొఫైల్స్ శరీరంలోకి చేరతాయి. వీటిలోని మరిన్ని సుగుణాలు ఏంటంటే..
మొలకెత్తిన విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొలకెత్తిన విత్తనాలలో ఉన్న చాలా ముఖ్యమైన ఎంజైములు జీర్ణ ప్రక్రియలను సులభతరం చేయడానికి, జీవక్రియను అదుపులో ఉంచడానికి, ఆహారం జీర్ణం అయ్యేప్పుడు కడుపులో రసాయన ప్రతిచర్యలను మెరుగుపరచడానికిసహాయపడతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. పండ్లు, కూరగాయలతో పాటు మొలకెత్తిన విత్తనాలు కూడా బరువును తగ్గించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అనేక పోషకాలతో ఉండి, కేలరీలు తక్కువగా ఉండడం వల్ల ఇవి బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఫుడ్ గా ఉంటాయి,
రోగనిరోధక శక్తి ని పెంచుతాయి, రక్త ప్రసరణకు చాలా మంచిది. వీటిలోని విటమిన్లు, ఇనుము, రాగి, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు శరీరంలో ఆర్‌బిసిల ఉత్పత్తిని పెంచడానికి, రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా అన్ని అవయవాలకు ఆరోగ్యకరమైన ఆక్సిజనేటెడ్ రక్తాన్ని సరఫరా చేస్తాయి.
గుండె ఆరోగ్యానికి మొలకెత్తిన గింజలు ఎంతో మంచివి. దీంట్లోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి గుండె సంబంధవ్యాధులు రాకుండా కాపాడుతుంది.
మొలకెత్తిన గింజల్లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ మీ చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. విటమిన్ ఎ హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలను, కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడానికి పనికివస్తుంది. దాంతోపాటు చర్మంలోని తేమ కోల్పోకుండా కాపాడుతుంది. దీంట్లోని జింక్ స్కాల్ప్ మీది సెబమ్ స్థాయి పెరిగేలా చేస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.
గుండె సంబంధ, జీర్ణక్రియ సంబంధమైన అనేక సుగుణాలు మొలకల్లో ఉండడం వల్ల క్యాన్సర్ కాకుండా నిరోదించగలుగుతుంది. దీంట్లోని అధిక స్థాయిలో ఉండే గ్లూకోరాఫనిన్ అనేక రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది.

Latest Videos

click me!