ఈ లేబుల్స్ ఉన్న ఫుడ్ చాలా ప్రమాదం..!

First Published Apr 19, 2021, 10:38 AM IST

నచ్చినవి బుట్టలో వేసుకొని.. చివరగా బిల్ వేయించుకోవడం. ఇది చాలా కామన్ గా మనం చేసే పని. కానీ.. మీలో ఎవరైనా.. సూపర్ మార్కెట్లో వస్తువులు కొనేటప్పుడు దానిపై ఉన్న లేబుల్స్ ని ఎప్పుడైనా చెక్ చేశారా..? 

ప్రస్తుతం ఎక్కడ చూసిన సూపర్ మార్కెట్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఆ సూపర్ మార్కెట్స్ కి వెళ్లడం.. అందులో నచ్చినవి బుట్టలో వేసుకొని.. చివరగా బిల్ వేయించుకోవడం. ఇది చాలా కామన్ గా మనం చేసే పని. కానీ.. మీలో ఎవరైనా.. సూపర్ మార్కెట్లో వస్తువులు కొనేటప్పుడు దానిపై ఉన్న లేబుల్స్ ని ఎప్పుడైనా చెక్ చేశారా..? దాదాపు ఆపని ఎవరూ చేసి ఉండరు. కానీ.. కొన్ని లేబుల్స్ ఉన్న ఆహార పదార్థాలు చాలా ప్రమాదమట. అవేంటో ఓసారి చూసేద్దాం.
undefined
1.ఫ్యాట్ ఫ్రీ, కొలిస్ట్రాల్ ఫ్రీ...ఈ మధ్యకాలంలో చాలా మంది ఆహారం ద్వారా కొవ్వు తమ శరీరంలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలో ఫ్యాట్ లెస్ ఫుడ్స్ ని ఎంచుకుంటున్నారు. ఇది మంచి పద్ధతే. కానీ.. కంపెనీలు ఆ లేబుల్ పేరిట మిమ్మల్ని పూర్తిగా మోసం చేస్తున్నారు.నిజంగానే ఆ ఫుడ్ లో ఫ్యాట్ లేకుండా ఉండదట. కాకపోతే మీరు ఊహించిన రూపంలో కాకుండా.. మరో రూపంలో దాంట్లో ఫ్యాట్ ని యాడ్ చేస్తారు. ఆ విషయాన్ని కూడా లేబుల్ ఓ ఉంచుతారు. కాకపోతే మనకే అర్థం కాదు. అంతే. కాబట్టి.. ఫ్యాట్ లెస్ అనగానే సంబరపడిపోయి కొనేయకండి.
undefined
2. ఇమ్యునిటీ బూస్టింగ్..కరోనా కాలంలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఫుడ్ ఐటెమ్.. ఇమ్యూనిటీ బూస్టర్స్. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందనే భయం జనాల్లో బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో... ఈ ఫుడ్ తింటే మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంటూ మార్కెట్లోకి చాలా ఫుడ్స్ తీసుకువస్తున్నారు. ఆ లెబుల్ చూసి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిల్లో అన్నీ నిజమే ఉండదని మోసం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
undefined
3.‘నో షుగర్ యాడెడ్’కొన్ని రకాల డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ లపై నో షుగర్ యాడెడ్ లేబుల్ వేస్తారు. అది చూసి మనం షుగర్ లేకుండా చేశారని నమ్మి వాటిని తాగేస్తాం. అందులో కూడా నిజం ఉండదని.. ఆ లేబుల్ చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు.
undefined
4.సింథటిక్ గ్రోత్ హార్మోన్స్..సింథటిక్ గ్రోత్ హార్మోన్లు rBGH మరియు rBST చాలా దేశాలలో నిషేధించబడ్డాయి. ఈ జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన హార్మోన్లు ఆవులలోకి చొప్పించి ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ సింథటిక్ హార్మోన్లు మానవ శరీరానికి హానికరం, ఇవి చాలా దేశాలలో ఎందుకు చట్టవిరుద్ధమైనవిగా పరిగణించబడుతున్నాయో వివరిస్తుంది.
undefined
5. కృత్రిమ కలర్స్..ఉత్పత్తి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి అనేక ఆహార పదార్థాలు కృత్రిమంగా రంగులను జోడించాయి. ఏ విధమైన కృత్రిమ రంగులు మీ ఆరోగ్యానికి మంచిది కానందున అటువంటి ఉత్పత్తులను సాధ్యమైనంతవరకు కొనడం మానేయడం మంచిది.
undefined
6.బరువు తగ్గించే టీలు..ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి బరువు తగ్గించే టీలు కూడా అడుగుపెట్టాయి. అయితే.. అవి నిజంగా బరువు తగ్గేందుకు సహాయం చేయవు. కాబట్టి.. అలాంటి వాటిని వాడి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
undefined
click me!