బాదం పప్పు తిని, తొక్క పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఆ పొరపాటు చేయరు..!

First Published | Sep 27, 2024, 1:17 PM IST

కేవలం పప్పు మాత్రమే కాదు.. తొక్కలోనూ  చాలా పోషకాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ బాదం పప్పు తొక్కలను మనం ఎలా వాడాలో.. ఎలా వాడితే మనకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం...
 

హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అనుకునేవాళ్లు అందరూ దాదాపు రెగ్యులర్ గా బాదం పప్పు తింటూ ఉంటారు. చక్కగా రాత్రి పూట ఆ బాదం పప్పును నానపెట్టి.. ఉదయాన్నే ఆ పప్పు పైన తొక్క తీసి మరీ తింటారు. బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. మన అందం కూడా పెరుగుతుంది. అయితే... కేవలం పప్పు మాత్రమే కాదు.. తొక్కలోనూ  చాలా పోషకాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ బాదం పప్పు తొక్కలను మనం ఎలా వాడాలో.. ఎలా వాడితే మనకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం...

బాదం పప్పు తొక్క వల్ల ప్రయోజనాలు..
బాదం పప్పు తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలా అని.. మనం డైరెక్ట్ గా వాటిని తినలేం. అలా అని బాదం పప్పుతో కలిపి కూడా తినకూడదు. అయితే.. ఆ తొక్కను తీసి... అవిసెగింజలు లేదంటే.. పుచ్చకాయ గింజలతో కలిపి పేస్టులాగా చేసుకొని.. గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే సరిపోతుంది. ఇలా తాగడం వల్ల.. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు...ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది, కాబట్టి ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

అంతేనా.. బాదం పప్పులో మాత్రమే కాదు.. బాదం తొక్కలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మన జుట్టుకు చాలా మేలు చేస్తుంది. మీరు బాదం తొక్కల నుండి హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఈ మాస్క్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మరియు మెరుస్తూ ఉంటుంది. బాదం తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ ఇ ఉంటాయి. దీని వల్ల మన చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్‌లలో కలుపుకుని ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి పోషణ , తేమను అందిస్తుంది.
 


కొన్నిసార్లు మనకు స్కిన్ ఇన్ఫెక్షన్లు , అలర్జీలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా ఈ బాదం తొక్కతో తరిమికొట్టవచ్చు. బకు స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే, తొక్కను మెత్తగా రుబ్బుకుని పేస్ట్ లా చేసి, ఇన్ఫెక్షన్ లేదా కురుపులు ఉన్న చోట రాయండి. ఇది మీకు ఉపశమనం కలిగించవచ్చు. తొక్కలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పాలలో కలుపుకుని తాగడం వల్ల లాభాలు పొందవచ్చు.
 

మరి నానపెట్టిన  బాదంపప్పు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం...

బాదంపప్పు రెగ్యులర్ గా తినడం వల్ల మన జీర్ణ క్రియ  మెరుగుపడుతుంది.  నానబెట్టిన బాదంపప్పులు సులభంగా జీర్ణమవుతాయి. ఈ ప్రక్రియ ఫైటిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇది ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. నానబెట్టిన బాదం జీర్ణవ్యవస్థపై ఎక్కువగా పని చేస్తుంది.  కాబట్టి రోజూ ముడు నుంచి నాలుగు వరకు తినవచ్చు. దీనిలో పోషకాలు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి. నానబెట్టిన బాదం ఎంజైమ్‌లను సక్రియం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. విటమిన్లు , ఖనిజాలు వంటి పోషకాలను అందిస్తుంది. మీ ఆహారంలో నానబెట్టిన బాదంపప్పులను చేర్చుకోవడానికి మంచి కారణాలలో ఒకటి అవి మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి. నానబెట్టిన బాదంపప్పులు మరింత రుచికరంగా ఉంటాయి. నానపెట్టడం వల్ల నమలడం ఈజీగా ఉంటుంది. 
బాదం పప్పుల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో  గ్లైసెమిక్ ఇండెక్స్ మొత్తమే ఉండదు. కాబట్టి ఇది మీ జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తి కూడా పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. వ్యాధులు రాకుండా ఉంటటానికి రోగనిరోధక శక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే బాదం పప్పులను తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నవారు బాదం పప్పులను రోజూ తినాలి. ఎందుకంటే దీనిలో ఐరన్ ఎక్కుమ మొత్తంలో ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తింటే రెండు వారాల్లో మీ శరీరంలో తేడాను గమనిస్తారు. 

బాదం పప్పులను రోజూ తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇది మీ పిల్లల మెదుడు సరిగ్గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలకు రోజూ నానబెట్టిన బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు మెదడు కణాలను రిపేర్ చేస్తాయి. అలాగే ఐక్యూ లెవెల్స్ ను పెంచుతాయి. మెదడును షార్ప్ గా చేస్తుంది. బాదం పప్పులు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ పప్పులు మన శరీరంలో  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడతాయి. బాదం పప్పుల్లో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!