మెదడును ఆరోగ్యంగా ఉంచడం నుంచి మలబద్దకాన్ని తగ్గించడం వరకు.. ఖర్జూరాలను తింటే ఎన్ని లాభాలో..!

First Published | Aug 22, 2023, 4:35 PM IST

ఖర్జూరాలు ఎన్నో ప్రయోజనాలున్న మంచి పోషకమైన పండు. వీటిలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి గొప్ప శక్తి వనరులు. ఖర్జూరాల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 
 

ఖర్జూరాల్లో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండ్లు సహజ చక్కెరలకు మంచి మూలం. అంతేకాదు ఇవి మన శక్తిని పెంచుతాయి. ఖర్జూరాల్లో విటమిన్లు, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

dates

మలబద్ధకాన్ని తగ్గించడానికి.. 

ఖర్జూరాల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలం సులువుగా కదలడానికి సహాయపడుతుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.
 

Latest Videos


Image: Freepik

మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి 

ఖర్జూరాలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది మెదడులో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఖర్జూరాల్లో పొటాషియం, విటమిన్ బి 6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 
 

Image: Freepik

గుండె ఆరోగ్యం

ఖర్జూరాల్లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే ఖనిజం. ఖర్జూరాల్లోని పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో కొలెస్ట్రాల్,  సోడియం తక్కువగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

Image: Freepik

ఎముకల ఆరోగ్యం

ఖర్జూరంలో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి చాలా అవసరం. ఎముకల ఆరోగ్యం, సాంద్రతను కాపాడటంలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. మీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image: Freepik

బరువు నిర్వహణ

ఖర్జూరాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరాల్లోని ఫైబర్ కడుపును తొందరగా నింపుతుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఖర్జూరంలోని సహజ చక్కెరలు అదనపు చక్కెరల అవసరం లేకుండా తీపి రుచిని అందిస్తాయి. ఇవి ఫుడ్ కోరికలను తగ్గించడానికి సహాయపడతాయి. 

click me!