కాలీఫ్లవర్ క్రూసిఫరస్ కూరగాయల కుటుంబానికి చెందింది. ఈ కూరగాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాలీఫ్లవర్ తెలుపు, ఆకుపచ్చ, ఊదా వంటి ఎన్నో రంగుల్లో ఉంటాయి. ఇది విటమిన్ సి మంచి వనరు. ఈ కూరగాయలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ బి5, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడే సల్ఫోరాఫేల్, ఇండోల్ -3 కార్బినోల్, గ్లూకోసినోలేట్స్ వంటి ఫైటోన్యూట్రియెంట్లకు మంచి మూలం.