దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో మనకు జీలకర్ర కచ్చితంగా ఉంటుంది. దాదాపు చాలా రకాల వంటల్లో మనం జీలకర్ర వాడుతూ ఉంటాం. ఇదే జీలకర్రను వంటలో భాగం చేసుకొని కాకుండా... జీలకర్ర వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా..? అసలు జీలకర్ర వాటర్ ఎందుకు తాగాలో తెలుసా..? ఇది ఎవరు తాగాలి..? దీని తాగితే కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...
ప్రతిరోజూ క్రమం తప్పకుండా జీలకర్ర వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యంలో చాలా మార్పులు జరుగుతాయట. ముఖ్యంగా ఈ వర్షాకాలం, చలికాలంలో చాలా ప్రయోజనాలు అందిస్తాయట. ఎందుకంటే ఈ సీజన్ లో పిల్లలు పెద్దలు తొందరగా జలుబు, దగ్గుల బారిన పడతారు. అదే జీలకర్ర వాటర్ తాగడం వల్ల.. అలాంటి సమస్యలు ఏమీ రావట. చాలా తొందరగా పరిష్కారం లభిస్తుందట. అసలు.. రెగ్యులర్ తాగితే.. ఇవి రాకుండా ఉంటాయి.
ఈ జీలకర్ర వాటర్ ని కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు తగ్గితే.. హై బీపీ కూడా కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. ఎవరికైతే హైబీపీ ఉంటుందో... వారుఈ జీలకర్ర వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల.. చాలా వరకు బీపీ కంట్రోల్ లో ఉంటుందట. ఎందుకంటే జీలకర్రలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. బీపీ కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది.
అంతేకాదు.. మెటబాలిజం మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడుతుంది. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడంతో పాటు... బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
మీకు ఎలాంటి జీర్ణ సమస్యలు ఉన్నా.. ఈ జీలకర్ర వాటర్ తాగితే మీకు బాగా సహాయపడుతుంది. జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా.. బాడీని చాలా బాగా డీ టాక్సిఫై చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి.
cumin water
షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. అయితే... ఉదయాన్నే తీసుకోవడం వల్ల మాత్రమే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. మీరు రాత్రిపూట జీలర్రను నానపెట్టి.. ఉదయాన్నే కాస్త మరిగించి.. వడపోసి తాగేస్తే సరిపోతుంది.