చలికాలంలో జామకాయలు పుష్కలంగా దొరుకుతాయి. జామకాయ సీజనల్ పండు కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఈ పండును కొంతమంది అస్సలు తినకూడదు. జామకాయ కొంతమందికి హాని చేస్తుంది. ఇంతకీ జామకాయను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఎవరు జామకాయలు తినకూడదు?
ఉదర సమస్యలతో బాధపడేవారు
జామకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ బరువు తగ్గడానికి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం, విరేచనాలు వంటి కడుపునకు సంబంధించిన సమస్యలుంటే మాత్రం జామకాయల్ని తినడం మంచిది కాదు. ఎందుకంటే జామకాయల్ని తింటే ఈ సమస్యలన్నీ మరింత పెరుగుతాయి.
తామర రోగులు
జామకాయలో ఉండే కొన్ని రసాయనాలు కొంతమందికి చర్మపు చికాకు కలుగుతుంది. ముఖ్యంగా మీకు తామర వంటి చర్మ సమస్యలు ఉటే మాత్రం జామకాయను తినడం మానుకోండి. ఇలాంటి వారు డాక్టర్ ను అడిగిన తర్వాతే జామకాయల్ని తినాలి.
గర్భిణులు, బాలింతలు
పాలిచ్చే తల్లులు, గర్బిణుల శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. అందుకే వీళ్లు ఈ సమయంలో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి ఆహారాల్లో జామకాయలు ఒకటి. జామకాయల్ని తింటే గర్భిణులకు వాంతులు, కడుపు నొప్పితో పాటుగా ఇతర సమస్యలు వస్తాయి. అలాగే పాలిచ్చే తల్లులు కూడా జామకాయల్ని తినకూడదు. ఇది మీ బిడ్డకు హాని చేస్తుంది.
జలుబు, దగ్గు రోగులు
దగ్గు, జలుబు సమస్యలు చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు జామకాయల్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఈ సమస్యల్ని మరింత పెంచుతాయి.
డయాబెటిస్ పేషెంట్లు
జామకాయలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటీస్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే జామకాయల్ని డయాబెటీస్ ఉన్నవారు తినకూడదంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు.