Mutton: మేక మటన్ మంచిదా గొర్రెది మంచిదా.? ఏది తింటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసా.?

Published : Mar 02, 2025, 12:55 PM ISTUpdated : Mar 10, 2025, 05:36 PM IST

ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది ఇళ్లలో మటన్‌ ఉడకాల్సిందే. ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ వార్తల నేపథ్యంలో మటన్‌ విక్రయాలు భారీగా పెరిగాయి. అయితే మటన్‌లో మేక, గొర్రె మాంసం రెండూ ఉంటాయి. ఒకేలా కనిపించినా ఈ రెండింటిలో కొన్ని తేడాలు ఉంటాయి. ఇంతకీ మేక, గొర్రె మాంసంల మధ్య ఉన్న తేడాలు ఏంటి.? ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Mutton:  మేక మటన్ మంచిదా గొర్రెది మంచిదా.?  ఏది తింటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసా.?

మేక, గొర్రె రెండింటి మాంసం చూడ్డానికి ఒకేలా కనిపిస్తుంది. కానీ ఈ రెండింటికి మధ్య తేడా ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మంది మేక మాంసానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇంతకీ మేక, గొర్రె మాంసంల మధ్య ఉన్న తేడా ఏంటి.? వీటిలో ఆరోగ్యానికి ఏది మంచిది. గొర్రె, మేక మాంసానికి మధ్య ఉండే ప్రధానమైన తేడాలు ఏంటో చూద్దాం. 
 

24

మేక మాంసం: 

మేక మాంసాన్ని లీన్‌ మీట్‌గా చెబుతుంటారు. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. మేక మాంసంలో ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండడంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఇక మేక మాంసంలో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మేక మాంసం కాస్త గట్టిగా ఉంటుంది. ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. 
 

34
mutton

గొర్రె మాంసం: 

మేక మాంసంతో పోల్చితే గొర్రె మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు, అంతకు ముందు హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చిన వారు, స్టంట్‌ పడ్డవారు గొర్రె మాంసానికి వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది. ప్రోటీన్‌ విషయానికొస్తే ఈ రెండింటిలోనూ సమానమైన ప్రోటీన్‌ ఉంటుంది. మేక మాంసంతో పోల్చితే గొర్రె మాంసంలో ఐరన్‌ శాతం తక్కువగా ఉంటుంది. గొర్రె మాంసం చాలా స్మూత్‌గా ఉంటుంది. త్వరగా ఉడుకుతుంది. జీర్ణ సమస్యలున్న వారికి గొర్రె మాంసం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 
 

44
mutton

రెండింటిలో ఏది ఉత్తమం.? 

ఆరోగ్యపరంగా చూస్తే గొర్రె మాంసంతో పోల్చితే మేక మాంసం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మేక మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఐరన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే రుచి పరంగా గొర్రె మాంసం బెస్ట్‌ ఆప్షన్‌ అని కొందరు భావిస్తుంటారు. త్వరగా ఉడుకుతుంది కూడా. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలనుకునే వారు మేక మాంసం తినడమే మంచిది. 

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

click me!

Recommended Stories