రాత్రిపూట ఏయే పండ్లను తినకూడదో తెలుసా?

First Published | Aug 2, 2024, 4:47 PM IST

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్లను రాత్రిపూట అస్సలు తినకూడదు. ఎందుకంటే? 
 

మనలో చాలా మందికి రాత్రిపూట బాగా ఆకలి వేస్తుంటుంది. దీంతో ఇంట్లో ఉన్న స్నాక్స్ ను తింటుంటారు. ముఖ్యంగా పండ్లను. పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. రాత్రిపడుకునే ముందు మాత్రం తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. అవికూడా కొన్ని రకాల పండ్లను. అసలు రాత్రిపూట ఏ పండ్లను తినకూడదు? ఎందుకు తినకూడదో? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అరటి

అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ పండ్లలో చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఈ అరటి పండ్లు రాత్రిపూట జీర్ణం కావడం కష్టం. నిద్రపోవడానికి ముందు అరటిపండ్లను తింటే కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల మీకు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. 
 


నారింజ

నారింజ పండ్లను కూడా రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతాయి. ముఖ్యంగా నిద్రపోవడానికి ముందు ఈ పండ్లను తింటే శారీరక అసౌకర్యం కలుగుతుంది. ఇది రాత్రిపూట మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాగే రాత్రంతా మీకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే నారింజ పండ్లను రాత్రిపూట తినకూడదని నిపుణులు చెప్తారు. 
 

Grapes

ద్రాక్ష

ద్రాక్ష పండ్లను కూడా రాత్రిపూట అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లలో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అలాగే మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనీయవు. ద్రాక్షలను తింటే రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో మీకు రాత్రిళ్లు సరిగ్గా నిద్ర ఉండదు.
 

పైనాపిల్

పైనాపిల్ ను కూడా రాత్రిపూట తినకపోవమే మంచిది. ఈ పండ్లలో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని నిద్రపోవడానికి ముందు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఈ పండును ఉదయం తినడమే మంచిది. 

Latest Videos

click me!