ఈ ఫుడ్స్ ఎక్కువ మొత్తంలో కొంటున్నారా? జరిగే ప్రమాదం ఇదే ..!

First Published | Sep 22, 2023, 12:38 PM IST

వీటిని కూడా చాలా మంది ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ వీటి లైఫ్ కూడా చాలా  తక్కువ. కాబట్టి, వీటిని కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం కరెక్ట్ కాదు.

ప్రతి ఒక్కరూ ఇంట్లోకి అవసరం అయ్యే నిత్యవసర సరుకులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, ప్రతిసారీ దుకాణం కి వెళ్లి కొనుగోలు చేయడం ఎందుకు అనే భావనతో చాలా మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల కొన్ని ఆహారా పదార్థాల్లో న్యూట్రిషన్స్ తగ్గిపోతాయట. మరి అలాంటి ఫుడ్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్స్ ని తక్కువ మొత్తంలో కొనుగోలు చేసుకోవాలో ఓసారి చూద్దాం..

ఇంట్లోకి సరుకులు కొనుగోలు  చేయడానికి ముందు మనం ఓ లిస్ట్ తయారు చేసుకుంటాం. కదా, అలా తయారు చేసుకునేటప్పుడే, కొన్ని వస్తువులను  చాలా తక్కువ మొత్తంలో రాసుకోవాలి.
 

Latest Videos


1.మసాలాలు మనం భారతీయ వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. అయితే, ఆ మసాలాలు ఎక్కువ కాలం లైఫ్ ఉండవు. కాబట్టి, వాటిని మనం చాలా తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేసుకోవాలి. అయిపోయిన తర్వాత వాటిని మళ్లీ తెచ్చుకోవడం లాంటివి చేసుకోవాలి. ఇదే మంచి పద్దతి.

cooking oil

2.వంట నూనె.. మనలో చాలా మంది వంట నూనెను ఒకేసారి 5, 10 లీటర్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ, అలా తెచ్చుకోవడం మంచిది కాదట. నూనె ఎక్కువ కాలం నిల్వ  ఉంటే దాని సుగుణాలు కోల్పోతుంది. న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. అంతేకాకుండా, ఒకరకమైన వాసన కూడా వస్తుంది. అందుకే,  రెండు, మూడు కన్నా ఎక్కువ లీటర్ల నూనె కొనుగోలు చేయకూడదు.

3.పాల ఉత్పత్తులు.. వీటిని కూడా చాలా మంది ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ వీటి లైఫ్ కూడా చాలా  తక్కువ. కాబట్టి, వీటిని కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం కరెక్ట్ కాదు.

Eating these fruits on an empty stomach is best for health

4.ఇక, పండ్లు, కూరగాయలు తినడానినకి ఆరోగ్యానికి మంచిదే కదా అని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు. కానీ, ఇవి వీటిని నిల్వ కాలం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని కూడా ఎక్కువగా కొనుగోలు చేయడం మంచిది కాదు. త్వరగా పాడైపోతాయి.

packaged food

5.ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ,  ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు.

nuts

6.నట్స్, గింజలు కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయకూడదు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల  ఒకరకమైన వాసన వస్తాయి. వాటి ప్రయోజనాలు కూడా తగ్గిపోతాయి.

refined flour

7.గోధుమ పిండి.. గోధుమ పిండి తాజాదనం ఎక్కువ కాలం ఉండదు. చాలా త్వరగా పురుగు పట్టడం, వాసన రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే, ఈ పిండిని కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు.

Image: Freepik

8.బ్రెడ్.. చాలా మంది బ్రెడ్ కొనుగోలు చేసి దానిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుతూ ఉంటారు. కానీ, దీని లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. డేట్ దాటిన పోయిన తర్వాత బ్రెడ్ ని అస్సలు తినకూడదు. దానికి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం కూడా అంత మంచిది కాదు. 

click me!